జమ్మూలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్: ఇద్దరికి గాయాలు

Published : Sep 21, 2021, 03:39 PM IST
జమ్మూలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్: ఇద్దరికి గాయాలు

సారాంశం

జమ్మూ కాశ్మీర్  రాష్ట్రంలో  ఆర్మీ హెలికాప్టర్  కుప్పకూలింది.ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు గాయపడ్డారు. ఆర్మీ కి చెందిన ఇద్దరు పైలెట్లు గాయపడ్డారు. శిక్షణ సమయంలో ఈ హెలికాప్టర్ కూలిందని అధికారులు తెలిపారు.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్(Udhampur) జిల్లాలో మంగళవారం నాడు ఆర్మీ హెలికాప్టర్ (Army helicaptor) కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు గాయపడ్డారు. గాయపడిన పైలెట్లను  ఆసుపత్రికి తరలించారు.జమ్మూ: జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ జిల్లాలో మంగళవారం నాడు ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఆర్మీకి చెందిన చీత హెలికాప్టర్  శిక్షణ తీఃసుకొంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంటుంది.ఉధంపూర్ జిల్లాలోని శివ్‌ఘర్ ధర్ ఏరియాలో హెలికాప్టర్ కుప్పకూలిందని అధికారులు ప్రకటించారు.ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు పైలెట్లు గాయపడ్డారు.వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం 10:30 గంటల నుండి 10:45 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.హెలికాప్టర్ కూలిన విషయం తమకు తెలియగానే తమ సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొన్నారని  ఉధంపూర్ డీఐజీ రీసీ రేంజ్ సులేమాన్ చౌధురి తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India US Relations : తగ్గేదేలే ! రష్యా చమురుపై అమెరికాకు ఇండియా మాస్ వార్నింగ్
Social Media Ban : పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్... ఎలా అమలుచేస్తారో తెలుసా..?