జ‌మ్మూ స‌రిహ‌ద్దులో మ‌రోసారి చొర‌బాటు య‌త్నం.. న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌తం

Published : Jun 23, 2023, 01:01 PM ISTUpdated : Jun 23, 2023, 01:02 PM IST
జ‌మ్మూ స‌రిహ‌ద్దులో మ‌రోసారి చొర‌బాటు య‌త్నం.. న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌తం

సారాంశం

Kupwara: ఉత్తర కాశ్మీర్ లోని సరిహద్దు కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్ లో భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ చ‌ర్య‌తో భద్రతా దళాలు శుక్రవారం భారీ చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. ఈ ఆప‌రేష‌న్ లో క్ర‌మంలో హ‌త‌మైన ఉగ్ర‌వాదుల నుంచి భారీగా ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.   

Kashmir Encounter: ఉత్తర కాశ్మీర్ లోని సరిహద్దు కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్ లో భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ చ‌ర్య‌తో భద్రతా దళాలు శుక్రవారం భారీ చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. ఈ ఆప‌రేష‌న్ లో క్ర‌మంలో హ‌త‌మైన ఉగ్ర‌వాదుల నుంచి భారీగా ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్ లోని కుప్వారాలోని మ‌చిల్ సెక్టార్ లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మట్టుబెట్టాయి. పోలీసులు, భారత సైన్యం సంయుక్త ఆపరేషన్ లో ఉగ్రవాదులను హ‌త‌మార్చిన‌ట్టు సంబంధిత అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

#Kupwara మచిల్ సెక్టార్ లోని కాలా జంగిల్ లో పీఓజేకే నుంచి తమ వైపుకు చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్ర‌వాదుల‌ను సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో హతమార్చారని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. "ఇండియాన్ ఆర్మీ, జ‌మ్మూకాశ్మీర్ పోలీసులు ప్రారంభించిన సంయుక్త ఆపరేషన్ లో కుప్వారాలోని మచిల్ సెక్టార్ లోని ఎల్ఓసీ వెంబడి అప్రమత్తమైన దళాలు చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేశాయని" భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ట్వీట్ చేసింది. ఈ ఆప‌రేష‌న్ లో న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను  మట్టుబెట్టారు. వారి వ‌ద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామ‌ని పేర్కొంది. 

 

 

కాగా, కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలోని జుమ్గుండ్ కెరాన్ వద్ద భారీ చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు ఇదే తరహా జాయింట్ ఆపరేషన్ లో విఫలం చేసిన వారం తర్వాత ఈ ఎన్ కౌంట‌ర్ జరగడం గమనార్హం. ఆపరేషన్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వజ్ర డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ గిరీష్ కాలియా మాట్లాడుతూ భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉందని తెలిపారు. అయితే, ఇటీవలి కాలంలో నియంత్రణ రేఖ వెంబడి పెద్దఎత్తున‌ చొరబాట్లు జరిగే అవకాశం ఉందని భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ఇంటెలిజెన్స్ సమాచారం అందుతోందని పేర్కొన్నారు.

 

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు