గర్భిణీల కోసం అనుష్క శర్మ కీలక సమాచారం..!

Published : May 19, 2021, 10:15 AM IST
గర్భిణీల కోసం అనుష్క శర్మ కీలక సమాచారం..!

సారాంశం

ఇటీవ‌లి కాలంలో ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఈమ‌ధ్య‌నే ఆమె తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీతో క‌ల‌సి కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం నిధులు సేకరించారు.

బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇటీవల తల్లి అయ్యారు. ప్రస్తుతం ఆమె తన కూతురితో ఆనందంగా గడుపుతున్నారు. ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఎదుటివారికి సహాయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

  ఇటీవ‌లి కాలంలో ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఈమ‌ధ్య‌నే ఆమె తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీతో క‌ల‌సి కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం నిధులు సేకరించారు. ఇప్పుడు ఆమె గర్భవతుల‌కు, బాలింత‌ల‌కు సహాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. దీనికోసం అనుష్క హెల్ప్ లైన్ నంబర్‌ను షేర్ చేశారు. 

ఈ హెల్ఫ్‌లైన్ గర్భిణుల‌కు వైద్య సాయం అందించేందుకు స‌హాయ‌ప‌డుతుంది. హ్యాపీ టు హెల్ప్‌ పేరిట మహిళలకు వైద్య సహాయం అందించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్ సీడబ్ల్యు) ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్‌నంబర్‌ను షేర్ చేసిన‌ట్లు అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు. వైద్య సహాయం అందించడానికి ఎన్ సీడబ్ల్యు బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటుంద‌ని ఆమె తెలిపారు. అనుష్క ఈ హెల్ప్ లైన్ నంబర్‌తో పాటు సంస్థ ఈమెయిల్ కూడా షేర్ చేశారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !