నీట్ లో మంచి ర్యాంకు రాలేదని మరో యువతి ఆత్మహత్య

First Published Jun 8, 2018, 1:53 PM IST
Highlights

ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య 

నీట్ ఫలితాలు వెలువడినప్పటి నుండి దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు తిరుచ్చి జిల్లాలో నీట్ లో మంచి ర్యాంకు సాధించలేకపోయానని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. 

తిరుచ్చి కి చెందిన శుభశ్రీ అనే విద్యార్థిని ఆల్ ఇండియా స్థాయిలో మెడికల్ సీట్ల కోసం నిర్వహించిన సీట్ పరీక్ష రాసింది. అయితే ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఈమె ఆశించినట్లు మంచి ఫలితం రాలేదు. దీంతో మెడికల్ సీటు  రాదని భావించిన శుభశ్రీ అప్పటినుండి డిప్రెషన్ లో ఉంటోంది. 

ఇవాళ శుభశ్రీ ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శుభశ్రీ మృతిచెందింది. 

 నీట్ ఫలితాలు వెలువడిన తర్వాత తమిళనాడులో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండవది. తెలంగాణ లో కూడా ఓ యువతి నీట్ లో మంచి ర్యాంకు రాలేదని అందరూ చూస్తుండగానే అపార్టుమెంటు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. ఇలా దేశవ్యాప్తంగా విద్యార్థులు నీట్ లో ర్యాంకు రాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.

click me!