హెచ్3ఎన్2 వైరస్ తో మహారాష్ట్రలో మరొకరు మృతి.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

By Asianet NewsFirst Published Mar 16, 2023, 4:59 PM IST
Highlights

దేశంలో హెచ్3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాలో ఈ వైరస్ వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరొకరు ఈ వైరస్ సోకి చనిపోయారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అలెర్ట్ అయ్యింది. 

మహారాష్ట్రలో హెచ్3ఎన్2 వైరస్ సోకడం వల్ల మరొకరు చనిపోయారు. దీంతో ఈ రాష్ట్రంలో ఈ తరహా మరణాల సంఖ్య మూడుకు చేరుకుంది. పుణెలోని పీసీఎంసీ యశ్వంత్ రావ్ చవాన్ మెడికల్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న 73 ఏళ్ల వృద్ధుడు ఈ వైరస్ తో చనిపోయాడని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. అయితే ఆ రోగి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాడని డాక్టర్లు తెలిపారు. కాగా.. తాజా మరణంతో ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు.

గ్లోబల్ టెర్ర‌రిజం ఇండెక్స్: ప్ర‌భావిత 56 దేశాల్లో ఒక‌టిగా భార‌త్..

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుండి పూణేలో మొత్తం 2,529 నమూనాలనను పరీక్షించగా.. 428 మందికి ఈ వైరస్ పాజిటివ్ వచ్చింది. ఫిబ్రవరి ద్వితీయార్థంలో అత్యధికంగా హెచ్ 3ఎన్ 2 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

ఇంత ఎక్కువ స్థాయిలో కేసులు నమోదు అవుతుండటంతో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల్లో సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు వాడాలని, సామాజిక దూరం పాటించాలని చెప్పారు. 

భారత ప్రజాస్వామ్యం పనిచేస్తుంటే.. నేను పార్లమెంట్‌లో మాట్లాడగలను: బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్..

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ వైరస్ కేసులు పెరుగుతుండటంతో అక్కడి ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. పుదుచ్చేరిలోని అన్ని పాఠశాలలను పది రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. వైరస్ వ్యాప్తి వల్ల మార్చి 16 నుంచి 26 అన్ని పాఠశాలకు సెలవులు ఇస్తున్నట్టు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ఎ.నమశివాయం బుధవారం ప్రకటించారు. ఈ ప్రాంతంలో మార్చి 11వ తేదీ వరకు కేంద్రపాలిత ప్రాంతంలో 79 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

అయితే పెరుగుతున్న కేసులను అదుపులోకి తీసుకురావడానికి ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని ఆరోగ్య శాఖ పకడ్బంధీగా చర్యలు తీసుకుంటోంది. ఇన్ ఫ్లూయెంజా చికిత్స కోసం హాస్పిటల్స్ లోని ఔట్ పేషెంట్ విభాగాల్లో ప్రత్యేక బూత్ లను కూడా యూటీ ప్రారంభించింది. వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని రాజకీయ పార్టీలు, తల్లిదండ్రులతో పాటు పలు వర్గాల నుంచి డిమాండ్ రావడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

సిసోడియాను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచడానికే తప్పుడు కేసులు.. : కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్

హెచ్3ఎన్2 కేసులను ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) నెట్ వర్క్ ద్వారా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కాలానుగుణ ఇన్ ఫ్లూయెంజా పరిస్థితిని రియల్ టైమ్ ప్రాతిపదికన నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మార్చి చివరి నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వైరస్ రోగుల వర్గీకరణ, చికిత్స ప్రోటోకాల్, వెంటిలేటర్ నిర్వహణపై మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించింది. 
 

click me!