తాతతో కలిసి డ్యూయెట్ పాడిన రెండు నెలల చిన్నారి...

Published : Nov 29, 2022, 09:56 AM IST
  తాతతో కలిసి డ్యూయెట్ పాడిన రెండు నెలల చిన్నారి...

సారాంశం

అలాంటిది ఓ రెండు నెలల చిన్నారి.. తన తాతతో కలిసి పాట పాడటం గమనార్హం. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. తాత పాట పాడుతుందే... దానికి ఆ చిన్నారి కూడా కోరస్ పాడటం గమనార్హం.

రెండు నెలల చిన్నారి నుంచి.. మనం మాటలు, పాటలు రావడం ఊహించగలమా...? ఆకలేసినా, నిద్ర వచ్చినా... ఏదైనా చిరాకు కలిగితే ఏడ్వడం తప్ప రెండు నెలల చిన్నారులు ఏం చేయగలరు..? చాలా తక్కువ మంది చిన్నారులు మాత్రమే... తమ వాళ్లను గుర్తుపడతారు. అలాంటిది ఓ రెండు నెలల చిన్నారి.. తన తాతతో కలిసి పాట పాడటం గమనార్హం. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. తాత పాట పాడుతుందే... దానికి ఆ చిన్నారి కూడా కోరస్ పాడటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోలొ తాత లాలి పాట పాడుతుంటే... దానిని అనుకరించడానికి ఆ చిన్నారి కూడా ప్రయత్నించడం గమనార్హం. ఆ చిన్నారి వయసు 2 నెలలు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది.


వీడియోలో, తాత శిశువును తన చేతుల్లో పట్టుకొని పాట పాడుతుండగా.. చిన్నారి కూడా  తాతయ్యను అనుకరించే ప్రయత్నం చేసి అతనితో పాడటం విశేషం. వాళ్ల తాత వైపు చూస్తూ... ఆసక్తిగా అనుకరించడం విశేషం. తాత గొంతు అద్భుతంగా ఉందని... ఆచిన్నారి ప్రయత్నం మరింత ప్రశంసనీయమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాత తోపాటు... ఆ రెండు నెలల చిన్నారి పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రైలు బాత్‌రూమ్‌లో యువ‌తీ,యువ‌కుడు.. 2 గంట‌లైనా త‌లుపు తీయ‌క‌పోయేస‌రికి. వైర‌ల్ వీడియో
Silver Wedding Card : వామ్మో.. పెళ్లి పత్రిక రేటు రూ. 25 లక్షలా? వైరల్ అవుతున్న ఫోటోలు!