యజమానిపై ప్రేమ కురిపించిన పెంపుడు కుక్క... వీడియో వైరల్...!

Published : Nov 29, 2022, 10:54 AM IST
యజమానిపై ప్రేమ కురిపించిన పెంపుడు కుక్క... వీడియో వైరల్...!

సారాంశం

మనుషులకు, కుక్కల మధ్య బంధాన్ని తెలియజేసే వీడియోలు ఇప్పటి వరకు చాలానే చూసి ఉంటాం. తాజాగా... అలాంటిదే మరో వీడియో ఒకటి నెట్టింట వైరల్ కాగా... నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  

కొంచెం ప్రేమ చూపిస్తే చాలు... మనుషులకన్నా.. కుక్కలు ఎక్కువ విశ్వాసం చూపిస్తాయి. ఈ విషయం మనకు తెలిసిందే.  మనుషులకు, కుక్కల మధ్య బంధాన్ని తెలియజేసే వీడియోలు ఇప్పటి వరకు చాలానే చూసి ఉంటాం. తాజాగా... అలాంటిదే మరో వీడియో ఒకటి నెట్టింట వైరల్ కాగా... నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

వీడియోలో, ఒక వ్యక్తి తన కంప్యూటర్‌లో పని చేస్తూ బిజీగా ఉండగా కుక్క ... అతని ఒడిలోకి ఎక్కి కుక్కపిల్ల కళ్లతో తన మనిషిని చూస్తూ ఉండిపోయింది. తనని పట్టించుకోవాలి అంటూ కుక్క అతని వైపు చూసిన చూపు... నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అతను తనని హగ్ చేసుకునే వరకు అది వదిలిపెట్టకపోవడం గమనార్హం. అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా...కుక్క ఇలా చేయడం గమనార్హం. 13 సెకన్ల వీడియో... ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 1 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. కుక్క చూపించే ప్రేమకు మళ్లీ ఆఫీసుకు వెళ్లాలి అని ఎవరూ అనుకోరు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం."ఎవరూ మిమ్మల్ని మీ కుక్కంతగా ప్రేమించరు...  అవి చాలా బేషరతుగా విశ్వాసపాత్రంగా ఉంటాయి. ’అని మరో నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Salary: ఉద్యోగం చేసే వారికి గుడ్ న్యూస్‌.. మ‌రో 2 నెల‌ల్లో భారీగా పెర‌నున్న జీతాలు.?