దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సానుభూతిపరుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు

Published : Apr 25, 2023, 10:07 AM IST
 దేశ వ్యాప్తంగా   పీఎఫ్ఐ  సానుభూతిపరుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు

సారాంశం

దేశంలోని  పలు  రాష్ట్రాల్లో  పీఎఫ్ఐ  సానుభూతిపరుల  ఇళ్లలో  ఇవాళ  ఉదయం  ఎన్ఐఏ  సోదాలు నిర్వహిస్తుంది.  


న్యూఢిల్లీ:  దేశంలోని  పలు రాష్ట్రాల్లో  ఎన్ఐఏ  సోదాలు నిర్వహిస్తుంది.  ఎన్ఐఏ సానుభూతిపరుల ఇళ్లు, కార్యాలయాల్లో  మంగళవారంనాడు  ఉదయం నుండి  ఎన్ఐఏ సోదాలు  చేస్తుంది.  ఉత్తర్ ప్రదేశ్, బీహార్ సహా  దేశంలోని  పలు  రాష్ట్రాల్లోని   చోట్ల  ఎన్ఐఏ అధికారులు సోదాలు  నిర్వహిస్తున్నారు.  

బీహార్ లోని  12 చోట్ల,  ఉత్తర్ ప్రదేశ్ లో  రెండు చోట్ల, పంజాబ్ ,  గోవాలలో  ఒక్కో చోట యఎన్ఐఏ  సోదాలు  చేస్తుంది.  బీహార్ లోని  దర్బంగా  మార్కెట్  యార్డు  ప్రాంతంలో  ఎన్ఐఏ  సోదాలు నిర్వహిస్తుంది.  నిషేధిత  పీఎఫ్ఐ  కార్యకలాపాల గురించి సమాచారం  రావడంతో  ఎన్ఐఏ  సోదాలు  నిర్వహిస్తున్నట్టుగా  స్థానిక పోలీసులు  చెప్పారు.

దర్భాంగ సిటీలోని  ఉర్దూ బజార్ ఏరియాలోని  ఓ డాక్టర్  నివాసంలో  శంకరపుర  గ్రామంలో ఓ వ్యక్తి  నివాసంలో  ఎన్ఐఏ  సోదాలు  చేస్తుంది.  బీహార్ లోని  తూర్పు చంపారా జిల్లాలోని  కున్వారా  గ్రామంలోని  సజ్జద్ నివాసంలో  సోదాలు  నిర్వహిస్తున్తున్నారు అధికారులు.

2022 సెప్టెంబర్ మాసంలో  పీఎఫ్ఐ  పై  కేంద్ర  ప్రభుత్వం నిషేధం విధించింది.  పీఎఫ్ఐ  తో పాటు  దీనికి అనుబంధంగా ఉన్న  సంస్థలు  సీరియస్  క్రైమ్ కు  పాల్పడుతున్నాయని  దర్యాప్తు  సంస్థలు  గుర్తించాయి.తెలంగాణ రాష్ట్రంలోని  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో  పీఎఫ్ఐ  కార్యకాలపాలు  వెలుగుచూశాయి.   నిజామాబాద్ లో  పీఎఫ్ఐ  కార్యకలాపాలు  నిర్వహిస్తున్న పలువురిని  పోలీసులు అరెస్ట్  చేశారు.  స్థానిక  పోలీసులు అరెస్ట్  చేసిన వారిని ఎన్ఐఏ కూడా విచారించింది 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu