నెల క్రితం కిడ్నాపైన యువతి.. తలలేని ఎముకల గూడుగా.. బావిలో తేలుతూ...

By AN TeluguFirst Published Oct 22, 2021, 11:12 AM IST
Highlights

ఎముకల గూడును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ధరించిన Dress ఆధారంగా  గత ఆరవ తేదీన అదృశ్యమైన తల్లి ఎంజిఆర్ నగర్ కు చెందిన కన్మణి కుమార్తె తిత్తిమిలా (19) మృతదేహం గా గుర్తించారు.

తమిళనాడు : సేలం జిల్లాలో గత ఆరవ తేదీన అదృశ్యమైన ఓ కళాశాల విద్యార్థిని మృతదేహం తల  లేకుండా  బావిలో తేలుతున్న ఎముకల గూడుగా బయటపడింది.  వివరాలు…  సేలం, karipatti, పిన్నాంపల్లికి చెందిన కాశీ విశ్వనాథంకు చెందిన వ్యవసాయ బావిలో తల లేకుండా ఉన్న యువతి deadbodyని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వారు ఎముకల గూడును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ధరించిన Dress ఆధారంగా  గత ఆరవ తేదీన అదృశ్యమైన తల్లి ఎంజిఆర్ నగర్ కు చెందిన కన్మణి కుమార్తె తిత్తిమిలా (19) మృతదేహం గా గుర్తించారు.

ఈమె సేలం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది.  తల్లిదండ్రులు దుస్తులను చూసి తిత్తిమిలాగా నిర్ధారించారు. head కనబడకపోవడంతో Wellలో తీవ్రంగా గాలిస్తున్నారు. 

స్నేహం ముసుగులో.. యువతులను మోసం చేస్తూ....
తమిళనాడులో మాయ మాటలతో, స్నేహం ముసుగులో విద్యార్థినులను, యువతులను బలవంతంగా లొంగదీసుకోవడమే కాదు... ఆ దృశ్యాల్ని కెమెరాలో బంధించి, తరచూ బెదిరిస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతూ వచ్చి మృగాళ్ల బండారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ పొల్లాచ్చి కేసులో నిందితులకు అండగా ఖాకీలు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. వీడియో వైరల్ కావడంతో ఓ స్పెషల్ ఎస్ఐతో సహా ఏడుగురిని గురువారం Suspended చేశారు. బాధితులు అనేక మంది గతంలో చేసిన ఫిర్యాదుతో మృగాళ్ల తిరునావుక్కరసు, శబరినాథన్, మణివణ్ణన్, వసంతకుమార్, సతీష్ తొలుత Arrest అయ్యారు. 

ఈ కేసు CBI చేతికి వెళ్లిన తరువాత అన్నాడీఎంకేకు చెందిన అరులానందన్, బాలు, బాబు పట్టబడ్డారు. ఈ కీచకుల్లో ఐదుగురు సేలం జైల్లో, మరో ముగ్గురు గోబి చెట్టి పాళయం జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. 

కాగా, బుధవారం వీరిని కేసు విచారణ నిమిత్తం కోయంబత్తూరు కోర్టుకు హాజరు పరిచారు. సేలం జైల్లో ఉన్న ఐదుగుర్ని ఎస్ఎస్ఐ సుబ్రహ్మణ్యంతో పాటుగా ఏడుగురు పోలీసులు వ్యానులో కోర్టుకు తీసుకొచ్చారు. 

మహిళ కిడ్నాప్.. కొట్టి, జుట్టు కత్తిరించి.. అఘాయిత్యానికి పాల్పడి..

రిమాండ్ పొడిగించినానంతరం వీరికి మరలా జైలుకు తరలించారు. అయితే, మార్గం మధ్యలో ఈ కీచకులకు అందగా భద్రతకు వెళ్లిన పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో అర్థరాత్రి వేళ వైరల్ గా మారింది. 

గోల్డెన్‌ట్విన్స్‌ షూటింగ్ స్పాట్ వద్ద పోలీసుల వాహనం ఆపేశారు. కీచకులు వారి కుటుంబీకులు, బంధువులు వారితో ముచ్చటించడమే కాకుండా, కోర్టు సమర్పించిన ఛార్జ్ షీట్ నకలు వారి చేతికి చేరింది. అరగంటకు పైగా కుటుంబంతో నిందితులు గడిపిన వీడియో వెలుగులోకి రావడంతో పోలీసు బాసులు స్పందించారు. 

ఎస్ఐ సుబ్రహ్మణ్యంతో పాటు ఏడుగురు పోలీసుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కీచకులు, వారి కుటుంబాలతో భద్రతకు వెళ్లిన వారికి ఉన్న సంబంధాలు, వారి నుంచి వీరికి ఏ మేరకు నగదు ముట్టిందో అన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో సీబీఐ సైతం సస్పెండైన ఏడుగురి మీద గురి పెట్టడం గమనార్హం. 

click me!