వీధి ఆడ కుక్కపై అరాచకం.. అత్యాచారం చేసి, మూడో అంతస్తు నుంచి విసిరేసిన కామాంధుడు..

By Asianet News  |  First Published Oct 27, 2023, 12:22 PM IST

ఉత్తరప్రదేశ్ లో ఆడ కుక్కపై వ్యక్తి క్రూరత్వానికి ఒడిగట్టాడు. రెండో అంతస్తులోని తన గదికి తీసుకెళ్లి, దానిని కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడి దగ్గరికి వస్తున్నారని గమనించి, మూడో అంతస్తు నుంచి ఆ కుక్కను కిందికి పడేశాడు.


కామాంధులు మూగ జీవాలను కూడా వదలడం లేదు.  కామంతో కళ్లు మూసుకుపోయి జంతువులపై కూడా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. గతేడాది మార్చిలో కేరళలో, ఈ ఏడాది సెప్టెంబర్ లో కర్ణాటకలో మేకపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో వెలుగులోకి వచ్చింది. ఓ వీధి కుక్కపై ఓ కామాంధుడు అరాచకానికి ఒడిగట్టాడు. దానిని ఇంట్లోకి తీసుకెళ్లి, కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

Narayana Murthy : యువకులు వారానికి 70 గంటలు పని చేయాలి - ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మథురకు చెందిన సోన్ వీర్ అనే వ్యక్తి గ్రేటర్ నోయిడాలో జీవిస్తున్నాడు. అక్కడ ఓ అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులో గది అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి ఆడ వీధికుక్కను పట్టుకుని రెండో అంతస్తులోని తన గదిలోకి తీసుకెళ్లాడు.

హమాస్ కు షాక్.. ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడి సూత్రదారులను మట్టుబెట్టిన ఐడీఎఫ్..

అక్కడ ఆ మూగ జీవిని కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను ఆ గదికి సమీపంలోనే నివసించే దంపతులు గమనించారు. ఈ దుశ్చర్యను చూసి వారు కేకలు వేశారు. ఆ దంపతుల కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే జనం రాకను సోన్ వీర్ గమనించాడు. వెంటనే ఆ కుక్కను మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి దానిని కిందికి విసిరేశాడు.

పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ను అరెస్టు చేసిన ఈడీ.. ఎందుకంటే ?

దీంతో ఆ కుక్కకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే దానిని దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కాగా.. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సోన్ వీర్ ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. జంతు క్రూరత్వానికి సంబంధించిన సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం కుక్క ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

click me!