సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఓ సినీ నటికి ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లలో ఒకరు చెబితే నమ్మి హోటల్ గదికి వెళ్లింది. అక్కడ అతడు ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటన గురుగ్రామ్ లో చోటు చేసుకుంది.
ఆమె ఓ సినీ యువ సినీ నటి. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. తరచూ రీల్స్, ఫొటోలు పోస్ట్ చేస్తుండేది. సెలబ్రెటీ కావడంతో వాటికి రీచ్ కూడా ఎక్కువగానే ఉండేది. అయితే కొంత కాలం కిందట ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ నుంచి ఓ మెసెజ్ వచ్చింది. తనను తాను పరిచయం చేసుకొని, సినిమాల్లో మంచి అవకాశాలు ఇప్పిస్తానని ఆఫర్ చేశాడు. ఇంటర్వ్యూ కోసం ఓ హోటల్ కు రమ్మని పిలిచి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
జిమ్ లో ట్రెడ్ మిల్ పై పరుగెత్తుతుండగా కరెంట్ షాక్.. యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో జూన్ 29న చోటు చేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన 24 ఏళ్ల యువతి భోజ్‌పురి సినిమా ఆర్టిస్ట్ గా పని చేసేది. ఆమెకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రామ్ లో అకౌంట్ ఉంది. తరచూ రీల్స్, ఫొటోలు పోస్ట్ చేస్తూ అందులో యాక్టివ్ గా ఉండేది. ఆమెకు భారీ సంఖ్యలోనే ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట మహేశ్ పాండే అనే వ్యక్తి ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. కొంత కాలం పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనే స్నేహం కొనసాగించాడు. ఈ క్రమంలో భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీలో తాను అవకాశాలు ఇప్పిస్తానని చెప్పాడు. అతడి మాటలను ఆ యువ నటి నమ్మింది.
డేరా బాబాకు మరోసారి పెరోల్ మంజూరు.. ఈ సారి ఎన్నిరోజులంటే..?
సినిమా అవకాశాల కోసం ఓ గురుగ్రామ్‌లోని ఉద్యోయ్ విహార్ ఏరియాలో ఉన్న ఓ హోటల్ లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని, అక్కడికి రావాలని ఆమెకు సూచించాడు. మహేశ్ చెప్పినట్టే ఆమె జూన్ 29వ తేదీన ఆ హోటల్ కు వెళ్లింది. అక్కడ అతడు ఆమెను పలు ప్రశ్నలు అడిగాడు. వాటికి నటి సమాధానాలు ఇచ్చింది. కొంత సమయం తరువాత మహేశ్ మద్యం సేవించడం మొదలుపెట్టాలని అనుకున్నాడు. దీనిని గమనించిన ఆమె అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ అతడు ఆమెను అడ్డుకున్నాడు. బలవంతంగా ఆ నటిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. చంపేస్తానని హెచ్చరించాడు.
మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. వారం రోజుల తర్వాత ముంబైలో ఆచూకీ..
తరువాత ఆమె తన ఇంటికి వచ్చింది. అయితే ఇటీవల ఆ నిందితుడి స్నేహితుల్లో కొందరు ఆమెకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆమె ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వారికి వివరించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరిపి వెంటనే నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు.