Minor gives birth to a baby: త‌మిళ‌నాడులో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక..12 ఏళ్ల బాలుడు అరెస్ట్!

Published : Apr 23, 2022, 07:06 AM IST
 Minor gives birth to a baby: త‌మిళ‌నాడులో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక..12 ఏళ్ల బాలుడు అరెస్ట్!

సారాంశం

Minor Girl gives birth to a baby: వివాహం కాకుండానే గ‌ర్బం దాల్చింది ఓ 17 ఏళ్ల బాలిక. ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టింది. వారం క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ 12 ఏళ్ల బాలుడిని అరెస్ట్​ చేశారు. తమిళనాడులోని తంజావుర్​లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

Minor Girl gives birth to a baby: వివాహం కాకుండానే గ‌ర్బం దాల్చింది ఓ బాలిక. ఆ విష‌యం కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టింది. వారం క్రితం ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది ఓ 17 ఏండ్ల బాలిక‌. అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ 12 ఏళ్ల బాలుడిని అరెస్ట్​ చేశారు. తమిళనాడులోని తంజావుర్​లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఆ బాలిక‌ గర్భం దాల్చ‌డానికి కారణం బాలుడేనా? మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

వివరాల్లోకెళ్తే.. తంజావుర్​కు చెందిన 17 ఏళ్ల బాలిక..  అదే ప్రాంతానికి చెందిన 12 ఏండ్ల బాలుడు.. బ‌డి మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహం ఏర్ప‌డింది. వీరిద్ద‌రూ చాలా స‌న్నహితంగా ఉండేవారు. అయితే.. ఆ బాలిక‌కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఏప్రిల్ 16న రాజా మిరాసుదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.  పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక గర్భవతిగా తేల్చారు. అదే రోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే.. వివాహం కాకుండానే పాపకు జన్మ నిచ్చినట్లు తెలుసుకున్న వైద్యులు.. వెంటనే తంజావుర్​ మహిళా పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు బాలికను విచారించగా.. ఆ సమ‌యంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి సమీపంలో ఉండే ఓ 12 ఏళ్ల బాలుడు త‌న‌పై త‌రుచు అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చినట్లు త‌న వాంగ్మూలం తెలిపింది. బాలిక ఫిర్యాదు మేర‌కు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం- 2012 (POSCO Act) కింద ఆ బాలుడిని అరెస్టు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం బాల నేరస్థుల పాఠశాలకు తరలించారు.  అయితే బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా బాలుడిని అరెస్టు చేసినప్పటికీ, మరెవ్వరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Jaipur Army Day Parade 2026 | CDS Anil Chauhan | Rajasthan CM Bhajanlal Sharma | Asianet News Telugu
జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu