
మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఘోరం జరిగింది. టాయిలెట్ లో ఓ బాలిక శవమై కనిపించింది. ఇంటర్వెల్ సమయంలో టాయిలెట్ కు వెళ్లి వస్తానని చెప్పిన బాలిక ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు వెళ్లి చూశారు. దీంతో ఆమె అందులో చనిపోయి కనిపించింది.
పాకిస్థాన్ లో మరో హిందూ దేవాలయం ధ్వంసం.. రాకెట్లతో దాడి చేసిన దుండగులు.. 24 గంటల్లో రెండో ఘటన
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నవీ ముంబై ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలిక వాషిలోని సెయింట్ మేరీస్ మల్టీపర్పస్ హైస్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఆరో తరగతి చదువుతోంది. ఆమె కొంత కాలం నుంచి జువెనైల్ డయాబెటిస్ (టైప్ 1 డయాబెటిస్)తో బాధపడుతోంది. అయితే ఎప్పటిలాగే శనివారం కూడా ఆమె ఇంటి నుంచి బయలుదేరి స్కూల్ కు చేరుకుంది.
గతేడాది వివాహం.. కానీ ఇప్పుడే ఘోరం.. నిద్రపోయే ముందు దిండు కింద ప్రతీ రాత్రి..
క్లాసులోకి వెళ్లి తోటి విద్యార్థులతో కూర్చుంది. ఉదయం 10 గంటల సమయంలో ఇంటర్వెల్ కావడంతో మూడో అంతస్తులో ఉన్న టాయిలెట్ కు వెళ్లింది. ఇంటర్వెల్ అయిపోయినా బాలిక క్లాస్ రూమ్ కు తిరిగి రాలేదు. కొంత సమయం తరువాత ఇతర విద్యార్థినులు టీచర్ల కు ఈ విషయం చెప్పారు. దీంతో టీచర్లు, ఇతర సిబ్బంది, విద్యార్థినులతో కలిసి టాయిలెట్లు ఉన్న మూడో అంతస్తుకు వెళ్లారు.
లోపలి నుంచి ఎలాంటి శబ్దమూ రాకపోవడంతో ఎలాగోలా తలుపు తెరిచి చూశారు. దీంతో ఆ బాలిక ఆపస్మారకస్థితిలో టాయిలెట్ లో పడిపోయి కనిపించింది. దీంతో స్కూల్ సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి కూతురును వాషిలోని ఎన్ఎంఎంసీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే బాలిక మరణించిందని చెప్పారు.
ముంబైలో మార్వే క్రీక్ లో మునిగిన ఐదుగురు బాలురు.. ముగ్గురు గల్లంతు.. ఇద్దరిని రక్షించిన స్థానికులు
ఈ ఘటనపై వాషి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ శశికాంత్ చండేకర్ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతానికైతే బాలిక మృతిపై ఎలాంటి అనుమానమూ లేదని అన్నారు. కాగా.. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు వాషిలోని ఎన్ఎంఎంసీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత్ జవాడే తెలిపారు. ఆమెకు జువెనైల్ డయాబెటిస్ హిస్టరీ ఉందని అన్నారు. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవని చెప్పారు.