అమరావతి ఫార్మాసిస్ట్ హత్య కేసు.. ఎన్ఐఏ విచారణకు ఆదేశించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

By Sumanth KanukulaFirst Published Jul 2, 2022, 4:46 PM IST
Highlights

ఉదయ్ పూర్ టైలర్ హత్య ఘటన మరవక ముందే అతడిలాగే నూపుర్ శర్మకు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించిన మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ ఎన్ఐఏ విచారణకు ఆదేశించారు. 

బీజేపీ బ‌హిష్కృత నేత నూపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు దేశం అంతా దుమారాన్ని రేపాయి. అనేక నిర‌స‌న‌లు, హింసాత్మ‌క ఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి. ఈ  క్ర‌మంలో ఇటీవ‌ల ఆమెకు మ‌ద్ద‌తుగా రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ కు చెందిన ఓ టైల‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీని త‌రువాత అత‌డు దారుణ హ‌త్య కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న దేశం మొత్తం సంచ‌ల‌నం సృష్టించింది. అయితే ఈ ఘ‌ట‌న మ‌ర‌క ముందే ఇలాగే నూపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తు తెలిపిన మ‌హారాష్ట్ర అమ‌రావ‌తికి చెందిన మ‌రో వ్య‌క్తి కూడా హ‌త్య‌కు గుర‌య్యాడ‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 

maharashtra crisis: ఎల్లుండి బల పరీక్ష.. స్పీకర్ ఎన్నికపై పావులు కదుపుతోన్న ఏక్‌నాథ్ షిండే

Latest Videos

మృతుడి పేరు ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే. ఆయన అమ‌రావ‌తిలో వెటర్నరీ ఫార్మసిస్ట్ గా ప‌ని చేస్తుండేవారు. ఆయ‌న నూపుర్ శ‌ర్మ‌కు అనుకూలంగా కొంత కాలం కింద‌ట ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అత‌డు హ‌త్యకు గుర‌య్యాడు. అయితే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)  ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్ఐఏ బృందాలు దర్యాప్తు కోసం మహారాష్ట్రలోని అమరావతికి వెళుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

కీల‌క ప‌రిణామ‌లు ఇవే..
54 ఏళ్ల ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే అమరావతిలో ఓ మెడికల్ షాప్ నడుపుతున్నాడు. ఆయన నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ పోస్టు షేర్ చేశాడు. అయితే, ఆయన అనుకోకుండా ఆ పోస్టును కొందరు ముస్లిం సభ్యులూ, తన కస్టమర్లూ ఉండే గ్రూపులోనే షేర్ చేసినట్టు కొత్వాలి పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. 

ఉదయ్‌పూర్ టైలర్ హంతకులతో మాకు సంబంధాల్లేవ్.. కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ స్పష్టీకరణ

- జూన్ 21వ తేదీన రోజు మాదిరిగా ఆ రోజు కూడా వెటర్నరీ ఫార్మసిస్ట్ ఉమేష్ కొల్హే త‌న దుకాణం మూసేసి ఇంటికి బ‌య‌లుదేరాడు. అదే స‌మ‌యంలో అత‌డు హ‌త్య‌కు గుర‌య్యాడు. హత్య వెనుక కుట్ర, సంస్థల ప్రమేయం, అంతర్జాతీయ లింకేజీలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎన్డీయే పక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా కెప్టెన్ అమరీందర్ సింగ్.. మీడియాలో ప్రచారం.!!

- ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు. వీరంతా పోలీసుల అదుపులో ఉన్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 120 బి (క్రిమినల్ కుట్ర) కింద కేసు నమోదు చేశారు. కాగా నూపుర్ శర్మ కు మ‌ద్ద‌తు తెలిపిన టైల‌ర్ క‌న్హ‌య్య లాల్ హ‌త్య‌కు, ఉమేష్ కొల్హే హత్యకు సంబంధం ఉందని బీజేపీ అమరావతి యూనిట్ ఆరోపించింది. ఉదయపూర్ హత్య దర్యాప్తును కూడా ఎంహెచ్ఏ ఎన్ఐఏకు అప్పగించింది.
 

click me!