maharashtra crisis: ఎల్లుండి బల పరీక్ష.. స్పీకర్ ఎన్నికపై పావులు కదుపుతోన్న ఏక్‌నాథ్ షిండే

Siva Kodati |  
Published : Jul 02, 2022, 04:39 PM ISTUpdated : Jul 02, 2022, 04:41 PM IST
maharashtra crisis: ఎల్లుండి బల పరీక్ష.. స్పీకర్ ఎన్నికపై పావులు కదుపుతోన్న ఏక్‌నాథ్ షిండే

సారాంశం

విజయవంతంగా ఉద్ధవ్ సర్కార్ ను కూల్చేసిన ఏక్ నాథ్ షిండే బలనిరూపణపై దృష్టి సారించారు. అలాగే రేపటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఎన్నికపైనా పావులు కదుపుతున్నారు. 

మహారాష్ట్రలో (maharashtra) ఉద్ధవ్ సర్కార్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన ఏక్ నాథ్ శిండే (eknath shinde) .. ఇక తదుపరి కార్యక్రమాలపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా బలపరీక్షను ఆయన ఎదుర్కోన్నారు. అయితే అంతకంటే ముందే స్పీకర్ ను ఎన్నుకోవాల్సి (speaker election ) రావడంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రేపటి నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు (maharashtra assembly session) జరుగుతుండగా.. అలాగే స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ రేసులో బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్.. మహా వికాస్ అఘాడీ (maha vikas aghadi) నుంచి శివసేన ఎమ్మెల్యే రాజన్ సల్వి పోటీలో నిలిచారు. దీనిలో భాగంగా రాజన్ శనివారం నామినేషన్ వేశారు. 

మరోవైపు.. సోమవారం కొత్త ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోనుండటంతో .. గోవాలో వున్న షిండే వర్గం ముంబైకి రానున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షిండే సహా రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత విషయం తేలే వరకు వారిని అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా చూడాలని శివసేన కోరుతోంది. దీనిపై జూలై 11న సుప్రీం విచారణ జరపనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే.. సీఎం ఏక్‌నాథ్ షిండేను శివసేన పార్టీలో అన్ని పదవుల నుంచి పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే శుక్రవారం తప్పించిన సంగతి తెలిసిందే. 

ALso Read:గౌహ‌తి నుంచి ఆఫర్ వ‌చ్చింది.. కానీ నేను వెళ్ల‌లేదు - శివసేన సీనియర్ నాయకుడు సంజ‌య్ రౌత్

ఇక మహారాష్ట్రలోని పరిణామాలపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ (sanjay raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఉండాల‌ని, గౌహ‌తికి రావాల‌ని త‌న‌కు ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని ఆయన వ్యాఖ్యానించారు. కానీ నేను బాలాసాహెబ్ ఠాక్రే అడుగుజాడల్లో నడిచే వ్యక్తిని. అందుకే నేను అటు వైపు వెళ్లలేదు. నిజం మనవైపు ఉన్న‌ప్పుడు ఎందుకు భయ‌ప‌డాల‌ని ? ’’ అని అన్నారు. 

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో బీజేపీ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింద‌ని, అయితే పార్టీని చీల్చి ఇది ఏర్పాటు చేసింద‌ని చెప్పారు. 2019 సంవ‌త్స‌రంలో బీజేపీ త‌న మాట‌కు కట్టుబడి ఉంటే రెండున్నర సంవత్సరాల పాటు ఆ పార్టీ వ్య‌క్తే సీఎంగా ఉండేవార‌ని అన్నారు. త‌మ పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీతో క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేదే కాద‌ని, అస‌లు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రయోగమే  జరిగేది కాదని అన్నారు.

ఇప్పుడు ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీ ఏం సాధించిందని రౌత్ ప్రశ్నించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో త‌మ పార్టీని విస్తరించడానికి ప్రయత్నిస్తామ‌ని చెప్పారు. సేన నుంచి విడిపోయిన ఓ వ‌ర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అన్నారు.  ఈ సంద‌ర్భంగా ఫడ్న‌వీస్ పై విరుచుకుప‌డ్డారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శివసేన-బీజేపీ ప్రభుత్వమా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. శివసేనను చీల్చ‌ల‌నే షిండే ఎత్తుగ‌డ త‌మ పార్టీని బ‌ల‌హీన ప‌ర్చింద‌ని సంజ‌య్ రౌత్ నొక్కి చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..