Amravati Murder : ఫార్మ‌సిస్టు హ‌త్య‌ను దోపీడి కేసుగా త‌ప్పుదోవ ప‌ట్టించారు - ఎంపీ న‌వ‌నీత్ రాణా

By team teluguFirst Published Jul 3, 2022, 8:41 AM IST
Highlights

మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ఫార్మసిస్టు హత్య కేసును పోలీసులు కావాలనే తప్పుదోవ పట్టించారని ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు. దీనిని దోపీడి కేసుకు చిత్రీకరించేందుకు ప్రయత్నించారని అన్నారు. ఎన్ఐఏ విచారణ ప్రారంభమయ్యే సమయంలోనే అది ఉదయ్ పూర్ టైలర్ హత్య మాదిరిగా కనిపిస్తోందని పోలీసులు చెప్పారని తెలిపారు. 

నూపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు చేసినందుకు మ‌హారాష్ట్ర అమ‌రావ‌తిలో ఓ వెట‌ర్న‌రీ ఫార్మ‌సిస్టు హ‌త్య‌కు గుర‌య్యాడనే విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)ను విచారణకు ఆదేశించింది. ఈకేసులో పోలీసుల‌పై తాజాగా ఎంపీ న‌వనీత్ రాణా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ కేసును దోపిడి స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌గా చిత్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నించార‌ని అన్నారు. అమ‌రావ‌తి క‌మిష‌న‌ర్ ఆర్తీ సింగ్ ను తొలగించాల‌ని డిమాండ్ చేశారు. 

Nupur Sharma: "ఇది మౌఖిక పరిశీలన, తీర్పు కాదు": నుపుర్ విష‌యంలో సుప్రీం సీరియ‌స్.. స్పందించిన లా మినిష్ట‌ర్

Latest Videos

ఈ మేర‌కు శ‌నివారం ఆమె ‘ఏబీపీ న్యూస్ (ABP NEWS)’తో మాట్లాడారు. అమరావతిలో జరిగిన హత్యను పోలీసుల వైఫల్యంగా ఎంపీ అభివ‌ర్ణించారు. అంత‌కు ముందు ఈ ఘ‌ట‌న విష‌యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశౄరు. రాష్ట్ర పోలీసులు ఈ విషయాన్ని అణిచివేస్తున్నారని అందులో ఆరోపించారు. పోలీస్ క‌మిష‌న‌ర్ ను తొల‌గించాల‌ని పేర్కొన్నారు. ఈ కేసును అటకెక్కించేందుకు అమరావతి కమిషనర్‌ ప్రయత్నించారని ఆరోపించారు. కొన్ని నెలల క్రితం అమరావతిలో అల్లర్లు జరిగినప్పుడు కూడా తాను గొంతు పెంచానని, విచార‌ణ‌కు డిమాండ్ చేశాన‌ని చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించ‌లేద‌ని అన్నారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

Pulitzer Prize winnerకు ఘోర అవ‌మానం.. విదేశాల‌కు వెళ్ల‌కుండా అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు

తాజాగా జరిగిన ఘటనపై పోలీసులతో తాను మాట్లాడాన‌ని ఎంపీ న‌వ‌నీత్ రాణా చెప్పారు. అయితే పోలీసులు అది దొంగ‌త‌నం కేసు అని చెప్పార‌ని తెలిపారు. త‌రువాత మృతుడు ఉమేష్ కోల్హే కుటుంబంతో మాట్లాడామ‌ని అన్నారు. అయితే అత‌డు చాలా సౌమ్యుడ‌ని, ఎవ‌రితోనూ గొడ‌వ‌లు లేవ‌ని త‌మ‌కు తెలిసింద‌ని అన్నారు. ఇది ఉద‌య్ పూర్ త‌ర‌హా ఘ‌ట‌నే అని ఆమె అన్నారు. ఎవరైనా దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేసి ఉంటే.. ఆ డబ్బును కూడా దోచుకునేవాడని కానీ ఇక్క‌డ అది జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. ఆ డబ్బు ఉమేష్ కోల్హే కుమారుడి వద్దే ఉంద‌ని చెప్పారు. 

Maharashtra murders: ఆత్మ‌హ‌త్యలు కావు.. హత్య‌లే.. మృతుల జేబుల్లో సూసైడ్ నోట్‌లు పెట్టిన మాంత్రికులు

కాంగ్రెస్‌ మంత్రి, మహారాష్ట్ర పోలీసులు, అమరావతి కమిషనర్‌ ఆర్తీ సింగ్‌ 12 రోజులుగా ఈ విషయాన్ని ఎందుకు బయటకు రానివ్వలేద‌ని ప్ర‌శ్నించారు. కత్తితో పొడిచి బహిరంగంగా హత్య చేసినా దానిని హ‌త్య కేసుగా చెబుతున్నార‌ని, కాబ‌ట్టి తమ‌కు రాష్ట్ర పోలీసుల‌పై న‌మ్మ‌కం లేక‌నే కేంద్ర హోంమంత్రికి,  NIA, CIAకి మళ్లీ లేఖ రాశామ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై దేవేంద్ర ఫడ్నవీస్‌తో కూడా మాట్లాడామని, ఆయన మళ్లీ హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారని చెప్పారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించార‌ని అన్నారు. ఎన్ఐఏ విచారణకు వచ్చినప్పుడే ఈ ఘ‌ట‌న ఉదయపూర్ టైల‌ర్ హ‌త్యలాగే క‌నిపిస్తోంద‌ని పోలీసులు చెప్పార‌ని అన్నారు. మ‌రి ఇంత కాలం ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాన నిందితుడిని ఎందుకు ప‌ట్టుకోలేద‌ని అన్నారు. 
 

click me!