అమిత్ షా కొన్ని ప్రధాన అంశాల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్, ముస్లింల వ్యక్తిగత చట్టం, ఇతర మతపరమైన అంశాల గురించి వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో అమిత్ షా ప్రసంగించారు. ప్రజాస్వామ్యం వల్ల రాజ్యాంగానికి మరింత బలం చేకూరింది అని అమిత్ షా అన్నారు. ఇండియా గ్లోబల్ స్థాయిలో ఆర్థిక శక్తిగా ఎదిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా అమిత్ షా కొన్ని ప్రధాన అంశాల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్, ముస్లిం లకు ప్రత్యేక చట్టం, ఇతర మతపరమైన అంశాల గురించి వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకువస్తుంది అని అని తెలిపారు. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో అమిత్ షా మరోసారి బిజెపి వైఖరిని స్పష్టం చేశారు.
undefined
ముస్లింల ప్రత్యేక చట్టం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని అమిత్ షా విమర్శించారు. ముస్లిం వ్యక్తిగత చట్టం అనేది కాంగ్రెస్ బుజ్జగింపు చర్య మాత్రమే అని అమిత్ షా అన్నారు. అసలు దాని గురించి కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలని అన్నారు. మతపరమైన రిజర్వేషన్స్ ని బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది అని అమిత్ షా అన్నారు.
ఇక ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల విమర్శలని అమిత్ షా తిప్పికొట్టారు. ఈవీఎం లకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు పిటిషన్ వేసినా సుప్రీం కోర్టు మొట్టికాలు వేస్తూనే ఉందని అమిత్ షా అన్నారు. ప్రతిపక్షాలు ఓడిపోయినప్పుడు ఈవీఎం లని తప్పు పట్టడం సాధారణంగా మారిపోయింది అని అమిత్ షా అన్నారు.