ఎంట్రన్స్, ఉద్యోగ నియామక పరీక్షలపై కేంద్ర మంత్రి క్లారిటీ ... ఇక NTA నిర్వహించేది ఆ ఎగ్జామ్సే!!

By Arun Kumar P  |  First Published Dec 17, 2024, 1:17 PM IST

ఉన్నత చదువుల కోసం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలు, ఉద్యోగ నియామకాల కోసం చేపట్టే పోటీ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 


ఇకపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సి (NTA) కేవలం ఉన్నత విద్యాబ్యాసానికి సంబంధించిన విద్యాసంస్థల్లో ప్రవేశానికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేసారు. 2025 నుండి ఈ ఏజన్సీ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలు నిర్వహించబోదని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్ లో కంప్యూటర్ ఆధారిత, టెక్నాలజీ సాయంతో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్దంగా వుందన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేద్ర ప్రధాన్ పార్లమెంట్ వేదికన ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

కేంద్ర ప్రభుత్వం పరీక్షల సంస్కరణలపై దృష్టి పెట్టినట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. NEET‌-UG పరీక్షలు ఇప్పటిలాగే పేపర్, పెన్ను విధానంలోనే కొనసాగించాలా లేదంటే ఆన్ లైన్ లో నిర్వహించాలా అన్నదానికి వైద్యారోగ్య శాఖతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్ టెస్ట్ (CUET)‌ మాత్రం ఏడాదికోసారి నిర్వహించనున్నట్లు మంత్రి స్పష్టం చేసారు. 

Tap to resize

Latest Videos

నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(NTA) ని 2025 లో పునరుద్దరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం10 కొత్త పోస్టులను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా ఇప్పుడున్న పరీక్షల విధానాన్ని పూర్తిగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 
 

click me!