అమిత్ షా : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్ & మరిన్ని

By Rajesh Karampoori  |  First Published Mar 7, 2024, 12:47 AM IST

Amit Shah Biography: అమిత్ షా .. భారతదేశ రాజకీయాలలో తిరిగి లేని ప్రభంజనం. ఆయన ఘాటైన విమర్శలను సైతం ఏ మాత్రం పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగే తీటైన రాజకీయవేత్త. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం..


Amit Shah Biography: అమిత్ షా .. భారతదేశ రాజకీయాలలో తిరిగి లేని ప్రభంజనం. ఆయన ఘాటైన విమర్శలను సైతం ఏ మాత్రం పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగే దీటైన రాజకీయవేత్త.  మితంగా మాట్లాడడం అమిత్ షా గుణాల్లో ఒకటి.  నిజానికి అమిత్ షా గురించి బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇంకా చెప్పాలంటే మోడీ విజయం తరువాత మోడీషా ద్వయం బలమేంటో అందరికీ తెలిసింది. అమిత్ షా .. ప్రత్యర్థులు ఎత్తుగడల్ని తిప్పి కొట్టడంలో దిట్ట. రాబోయే పరిస్థితులను చాలా ముందుగానే అంచనా వేసుకుని, తదనుగుణంగా తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటాడు. అందుకే ఆయనను ఆధునిక చాణక్యుడుగా అబివర్ణిస్తారు. 

Latest Videos

అమిత్ షా బాల్యం & కుటుంబం

అమిత్ షా అక్టోబర్ 22, 1964న ముంబైలో స్థిరపడిన గుజరాతి వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు అమిత్ అనిల్ చంద్ర షా.  ఆయన తండ్రి అనిల్‌చంద్ర షా , తల్లి పేరు కుసుమ్ బెన్ షా. ఆయన తండ్రి ముంబై స్టాక్ ఎక్స్చేంజి బ్రోకరింగ్ తో పాటు వీపీసీ పైపుల వ్యాపారాన్ని కూడా చేశారు. ఆయనకు  ఆరుగురు సోదరీమణులు. అమిత్ షా 1981లో అహ్మదాబాద్‌లోని జ్యోతి హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి 12వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీ లోని సియు సైన్స్ కళాశాలలో బయో కెమిస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి అమిత్ షా.. వ్యాపార రంగంలోకి ప్రవేశించి స్టాక్ మార్కెట్లోనూ.. అటు వారసత్వంగా వచ్చినా పైపుల వ్యాపారంలో చక్కగా రాణించారు.    అమిత్ షా 1987లో సోనాల్ షాను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు జై షా. ఆయన వృత్తిరీత్యా వ్యాపారవేత్త, ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.

అమిత్ షా రాజకీయ జీవితం

వాస్తవానికి అమిత్ షా రాజకీయ జీవితం ఆయన 14 ఏళ్ల వయసుతోనే ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ లో బాల స్వయం సేవకులు చేరిన అమిత్ షా తర్వాత కాలంలో సంఘ్ పరివార్ కొనసాగుతూ వచ్చాడు. రాష్ట్రీయ స్వయంసేవ కార్యకలాపాల్లో భాగంగా 1982లో ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా ఉన్న ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తొలిసారిగా కలుసుకున్నాడు అమిత్ షా. అలా ఆనాడు ప్రారంభమైన వారి స్నేహం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 

 అమిత్ షా 1984లో బీజేపీలో చేరారు. తొలుత పార్టీలో ప్రచారకర్తగా, బూత్ స్థాయి కార్యకర్తగా పనిచేశారు. అమిత్ షాజీ జీవితాన్ని 1991 వ సంవత్సరం గొప్ప మలుపు తిప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఆ సంవత్సరం ఆయన లోకసభ ఎన్నికల్లో గాంధీనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ తరఫున ఎన్నికల వ్యవహారాలను చూస్తూ ఆయన గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డారు. దీంతో అమిత్ షా పార్టీ అగ్ర నాయకుల దృష్టిని ఆకర్షించాడు. 

 అంతేగాక గుజరాత్ లో బీజేపీని విస్తరణ కార్యకలాపాల్లో భాగస్వామ్యం అయినా ఆయన..  ఆనాటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న నరేంద్ర మోడీతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అనేక యాత్రలో పర్యటించి బిజెపిని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో  విశేషంగా దోహదపడ్డారు. అనంతరం జరిగిన 1997లో సర్ఖేజ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి బీజేపీ టిక్కెట్‌పై అమిత్ షా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అదృష్టం అతనికి అనుకూలంగా ఉంది . ఇలా పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో ఆయన గెలిచాడు. ఇలా తొలిసారి గుజారాత్ శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు గుజరాత్ అసెంబ్లీ సీటును గెలుచుకుని, నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన రాష్ట్ర హోం మంత్రిగా వ్యవహరించారు. 

కానీ తరువాత అతను కేంద్ర రాజకీయాల్లో తన భాగస్వామ్యం అయ్యారు. 2014లో ప్రధాని మోదీని ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టడంలో ఆయన అద్భుత రాజనీతిని అమలు చేశారు. ఇలా అమిత్ షా తన మాస్టర్ ప్లాన్ కారణంగా 2014లో బీజేపీ ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. తత్ఫలితంగా షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. షా జాతీయ అధ్యక్షుడైన తర్వాత దేశంలోని ఆాయా రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించడం మొదలుపెట్టారు. రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేశారు. అమిత్ షా అద్భుతమైన మాస్టర్ ప్లాన్ కారణంగా.. 2019 కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది.  ప్రస్తుతం ముచ్చటగా మూడో సారి కూడా బీజేపీ అధికారం పగ్గాలు చేపట్టేలా మోడీ - షా ద్వయం ప్రణాళికలను రచిస్తోంది.  

అమిత్ షా విజయాలు 

1983 - అఖిల విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యత్వంతో విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
1985 - సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం పొందారు.
1991 - అప్పటి అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఎన్నికల ప్రచార బాధ్యతను స్వీకరించి.. ఆయనను గెలిపించారు. 
1996 - పార్టీలో తన ప్రతిభను ప్రదర్శించడానికి రెండవ సువర్ణావకాశం లభించింది.అటల్ బిహారీ గుజరాత్ నుండి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు, తన బిజీ షెడ్యూల్ కారణంగా అతను తన నియోజకవర్గంలో ప్రచారం చేయలేదు. ఆ ప్రచారాన్ని కూడా ఆయన ముందుండి నడించారు. దానిని కూడా సక్సెస్ చేశారు.
1997 - గుజరాత్‌లోని సర్ఖేజ్ అసెంబ్లీ స్థానం నుండి మొదటి ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తదుపరి ఎన్నికల్లో కూడా విజయాన్ని నిలబెట్టుకున్నారు.

2003 – 2010 – గుజరాత్ హోం మంత్రి పదవిని నిర్వహించారు.
2014 - బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
2017 - గుజరాత్ నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.
2019 - గుజరాత్‌లోని గాంధీనగర్ నుండి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.
2019 - మోడీ ప్రభుత్వంలో (ప్రస్తుత పదవి) రెండవసారి కేంద్ర హోం మంత్రి అయ్యారు.

click me!