రాహుల్ గాంధీ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్ & మరిన్ని

By Rajesh Karampoori  |  First Published Mar 7, 2024, 12:27 AM IST

Rahul Gandhi Biography: రాహుల్ గాంధీ..  భార‌త జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడు. ఆయ‌న మ‌న దేశ మొట్ట మొద‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూకి ముని మ‌న‌వ‌డు.  ఇందిరా గాంధికి మ‌న‌వ‌డు. భార‌త దేశ మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ కుమారుడు. ఇలాంటి రాజకీయ నేపథ్యంలో పుట్టిన రాహుల్ గాంధీ బాల్యం, విద్య, రాజీకీయ ప్రవేశం తదితర విషయాలు మీ కోసం


Rahul Gandhi: బాల్యం, విద్యాభ్యాసం.. 
 
Rahul Gandhi: 1970 జూన్ 19న రాజీవ్ గాంధీ-సోనియాగాంధీ దంపతులకు రాహుల్ గాంధీ  ఢిల్లీలో జన్మించాడు. నాయనమ్మ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావడం రాహుల్ కి ఎలాంటి లోటు లేకుండా చూడడమే కాదు ఆయనను కట్టుదిట్టమైన భద్రతతో పెంచారు .ఇంకా చెప్పాలంటే రాహుల్ గాంధీ గురించి బయటకు అస్సలు తెలియనివ్వలేదు. సోనియా గాంధీనే తన ఇద్దరు పిల్లల సంరక్షణ విషయంలో ఎవ్వర్నీ నమ్మేవారు కాదు. తానే పిల్లల బాధ్యతలను చూసుకునేంది.  రాహుల్ గోల్డెన్ స్పూన్ తో పుట్టిన భద్రత వలన కొంత స్వేచ్ఛ కోల్పోయాడని చెప్పాలి.స్కూల్లో అతడు ప్రధాన మనువుడిని తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు.

అందువలన చాలా రాహుల్ తరుచుగా స్కూల్స్ మార్చాల్సి వచ్చింది. డెహ్రాడూన్, ఢిల్లీ వంటి అనేక ప్రదేశాలలో చదివించారు. భద్రత కారణాల వల్ల ఆయనను కొన్ని రోజులు స్కూలుకి పంపించకుండా ఇంట్లోనే చదివించారు. 1984 డిసెంబర్ లో ఇందిరాగాంధీని తన సెక్యూరిటీ సిబ్బంది చంపేయడంతో సోనియాగాంధీ తన పిల్లలు విషయంలో భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో రాహుల్, ప్రియాంకలను ఇంట్లోనే చదివించారు.  1989లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చేరిన రాహుల్ ఆ మరుసటి సంవత్సరమే భారతదేశం వదిలి హార్డ్ వర్డ్ యూనివర్సిటీలో చేరాడు. దానికి కారణం కూడా బెదిరింపులే. అక్కడ కూడా ఆయన ఒక్క సంవత్సరమే చదివాడు. 

Latest Videos

undefined

ఇక 1991లో ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీని తమిళ టైగర్స్ (LTTE) హత్య చేశారు. ఈ ఘటనతో గాంధీ కుటుంబానికి మగ దిక్కు లేని కూడా అనాధగా మారింది. రాహుల్ గాంధీ మాత్రమే మగ దిక్కయ్యాడు.  కొడుకు బయటకు వస్తే ఎవరు చంపుతారనే భయపడ్డారు. ఈ తరుణంలో  ఆయనను USAలోని ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీకి మార్చబడ్డాడు. అతని గుర్తింపును అత్యంత రహస్యంగా ఉంచారు. "రాహుల్ విన్సీ" అనే పేరును ఉపయోగించాడు. 1994లో, అతను రోలిన్స్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసాడు.

ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో ఎం.ఫిల్ చేశారు. ఆ యూనివర్సిటీలో కూడా కొంతమంది లెక్చరర్ కి మాత్రమే ఇందిరాగాంధీ మనుమడని తెలుసు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి అక్కడే వెరైటీలో మానిటర్ గ్రూపులో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ లో పనిచేశాడు. ఆ తర్వాత 2002లో బ్యాక్అప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేయడానికి ముంబై వచ్చాడు. అక్కడ కొన్నాళ్ళు పనిచేశాక సోనియాగాంధీ తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ ని రాజకీయంగా ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు.

Rahul Gandhi:రాజకీయ ప్రవేశం

- రాహుల్ గాంధీ మార్చి 2004లో భారత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అద్భుతమైన విజయాన్ని సాధించారు. సెంటిమెంట్ కలిసి రావడంతో ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 

- ఈ విజయంతో రాహుల్ గాంధీ బయట ప్రపంచానికి తెలిశారు. గాంధీ కుటుంబానికి రాజకీయ వారసుడు వచ్చాడని కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.  ఎందుకంటే రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ కి సరైన నాయకత్వం లేదు. సోనియాగాంధీ మీద ఎవరికి నమ్మకం లేదు. ఆమెకు రాజకీయం కొత్త . పైగా ఆమె విదేశీ వనిత కావడంతో మరో మైనస్.  

- పార్టీ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా రాహుల్ గాంధీని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా 2004, సెప్టెంబర్ 24న నియమించారు.

- క్రమంగా పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇలా 2004నుంచి 2006 వరకు హోం వ్య‌వ‌హారాల స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా  వ్యవహరించారు. 

- అలాగే రాహుల్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా , ఇండియన్ యూత్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. 

- 2007 లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌లు చేపట్టిన రాహుల్ గాంధీకీ ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. రాష్ట్రంలో 403 సీట్ల‌కు గానూ కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 22 సీట్ల‌ను మాత్ర‌మే గెలిచింది.

- సెప్టెంబ‌రు 24, 2007 నాడు రాహుల్ గాంధీ ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయ్యారు. దీంతోపాటు కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం ఎన్ఎస్‌యూఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మితుల‌య్యారు.

- 2009 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి తన లోక్‌సభ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయ‌న త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థిపై 3,70,000 ఓట్ల తేడాతో గెలిచారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 21 లోక్‌స‌భా స్థానాల‌ను గెలుచుకోవ‌డం విశేషం.

- ఆగ‌స్టు 31, 2009న మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా  రాహుల్ నియ‌మితుల‌య్యారు.
  
- 11 మే 2011న భ‌ట్టా పారాసుల్ గ్రామంలో చోటు చేసుకున్న రైతుల ఆందోళ‌న‌లో రాహుల్ చురుగ్గా పాల్గొన్నారు. ర‌హ‌దారి ప్రాజెక్టు కోసం భూసేక‌ర‌ణ చేప‌ట్టిన‌ప్పుడు న్యాయ‌మైన ప‌రిహారం కోసం రైతుల తరుఫున పోరాటం చేశారు. ఈ క్రమంలో యూపీ పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఇలా తొలిసారి ప్రజాపోరాటంలో పాల్గొని , అరెస్ట్ అయ్యారు.  

- జనవరి 2013లో భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.  

- 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ తన లోక్‌సభ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.  కానీ 2009 నుండి 2014 మధ్య రాహుల్ గాంధీ తీరి చూసి కొంతమందికి అతను పీఎం కాండిడేట్ కాదని బహిరంగంగా ప్రకటించారు. 

- డిసెంబర్ 2017లో జరిగిన పలు మార్పుల వల్ల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సంపాదించాడు.

- 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో పార్టీ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేశారు.

Rahul Gandhi: నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹15.17 CRORE

 ఆస్తులు : ₹15.89 CRORE
  
Rahul Gandhi: ఆసక్తికర అంశం

- మాజీ క్యాబినెట్ మంత్రి వెంకయ్య నాయుడు ఒకసారి అతన్ని "పప్పు జీ" అని సంబోధించారు. అప్పటి క అతను సోషల్ మీడియాలో పప్పు అనే పేరుతో ట్రోల్ అయ్యాడు.

- రాహుల్ గాంధీ  లండన్ లో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించారనీ, ఆమె ప్రస్తుతం వెనిజులలో ఉంటుందని ప్రచారం. వీరిద్దరూ 2013లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారనీ,  కానీ అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు . 53 సంవత్సరాల రాహుల్ గాంధీ  ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉన్నారు. రాహుల్ గాంధీ దేశం కోసమే తన జీవితాన్ని తాగ్యం చేస్తున్ననని నిరూపించలేకపోయారు. 2024 ఎన్నికలలో అయినా.. ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కడుతారో వేచిచూడాలి.  

click me!