కోట్ల మంది ఆకలితో పస్తులు.. శానిటైజర్ల కోసం మిగులు బియ్యం: కేంద్రం నిర్ణయంపై విమర్శలు

By Siva Kodati  |  First Published Apr 21, 2020, 5:31 PM IST

లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక దేశంలో లక్షలాది మంది వలస కూలీలు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వివాదాస్పదమైంది


లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక దేశంలో లక్షలాది మంది వలస కూలీలు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. వివరాల్లోకివ వెళితే.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ అధ్యక్షతన నేషనల్ బయో ఫ్యూయల్ కో ఆర్డినేషన్ సమావేశం మంగళవారం జరిగింది.

దేశ వ్యాప్తంగా పలు గోదాముల్లో అవసరానికి మించి ఉన్న బియ్యాన్ని ఇథనాల్‌గా మార్చి శానిటైజర్ల తయారీకి, కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోల్‌లో కలిపి ఉపయోగించేలా ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

Latest Videos

Also Read:కరోనా పరీక్షలకు రెండు రోజులు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వాడొద్దు: ఐసీఎంఆర్ కీలక సూచన

దేశంలో అధికారిక గణాంకాల ప్రకారం ఎఫ్‌సీఐ గోడౌన్లలో 58.49 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. ఇందులో 30.97 మిలియన్ టన్నుల బియ్యం, 27.52 మిలియన్ టన్నుల గోధుమలు ఉన్నాయి.

నిర్దేశించిన ఆహార నిల్వల కంటే ఏప్రిల్ 1 నాటికి 21 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇథనాల్‌తో హ్యాండ్ శానిటైజర్ల తయారీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వ షూగర్ కంపెనీలు, డిస్టలరీస్‌కు అనుమతి ఇచ్చింది.

Also Read:తమిళనాడులో జర్నలిస్టులపై కరోనా దెబ్బ: న్యూస్ ఛానల్‌‌లో పనిచేస్తున్న 27 మందికి కోవిడ్

సాధారణంగా పెట్రోల్‌లో కలిపేందుకు ఇథనాల్‌ను చమురు సంస్థలకు షూగర్ కంపెనీలు సరఫరా చేస్తుంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున శానిటైజర్లు తయారు చేసి ఆసుపత్రులు, సంస్థలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు భారత షూగర్ కంపెనీల సంఘం వెల్లడించింది.

వీటిని తయారు చేసిన ధరకు లేదా ఉచితంగా అందించనున్నట్లు ఈ సంఘం ప్రకటించింది. మరోవైపు దేశంలో లాక్‌డౌన్ అమలు కారణంగా 80 కోట్ల మంది పేదలకు రానున్న మూడు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. తాజాగా బియ్యం నిల్వలను శానిటైజర్ల తయారీకి ఇస్తామని ప్రకటించడంతో పలువురు విమర్శిస్తున్నారు. 

click me!