Chinese mobile smartphone కంపెనీల‌కు ఐటీ షాక్‌..

By Rajesh KFirst Published Dec 23, 2021, 9:35 AM IST
Highlights

 చైనా మొబైల్‌ ఫోన్స్‌ కంపెనీలకు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ  షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన ఒప్పో, షావొమీ, వన్‌ప్లస్‌ మొబైల్‌ కంపెనీల కార్యాలయాలు, ఉన్నతాధికారుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. 
 

భార‌త్ లో చైనా కంపెనీ మొబైల్‌ ఫోన్స్ (Chinese mobile smartphone) జోరు ఎలా ఉంటుందో అంద‌రికీ తెలుసు. చైనీయులు మాత్రం తమ దేశంలో తయారయిన స్మార్ట్‌ఫోన్‌లు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ, చైనా కంపెనీలు తయారు చేసిన స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో డిమాండ్ మాత్రంలో ఓ రేంజ్ లో ఉంటుంది. జియోమీ (Xiaomi), ఒప్పో(Oppo), రియల్ మీ ( Realme), వివో (Vivo) భారతదేశంలోని టాప్ 5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లుగా కొన‌సాగుతున్నాయి. 
 
ఇదిలా ఉంటే... ఈ  చైనా కంపెనీలకు షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన ఒప్పో, షావొమీ, వన్‌ప్లస్‌ మొబైల్‌ కంపెనీల కార్యాలయాలు, ఉన్నతాధికారుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ త‌నిఖీలు నిర్వ‌హించింది. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీలు భారీ ఎత్తున పన్నులు ఎగవేసేందుకు నియమ, నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని,  I-T డిపార్ట్‌మెంట్‌తో సహా అనేక ప్రోబ్ ఏజెన్సీల రాడార్‌లో ఉన్నాయని ఆరోపించారు. విశ్వ‌నీయ స‌మాచారం మేర‌కే  ఆయా కంపెనీల సీఈవోలు, ఇతర ప్రతినిధులను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ తనిఖీలు చేస్తోన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న చైనీస్ మొబైల్ కంపెనీలకు చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించాయి. 

ఈ క్ర‌మంలో దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాలైనా.. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గ్రేటర్‌ నోయిడా, కోల్‌కత, గువాహటి, ఇందోర్‌తోపాటు పలు ప్రాంతాల్లో 24కుపైగా కార్యాలయాల్లో ఇన్ కాం ట్యాక్స్ ( ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోలు  వంటి ఆర్థిక సేవల్లో ఉన్న కొన్ని కంపెనీలూ ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. 

Read Also : 7500 బిట్ కాయిన్లను చెత్త బుట్టలో పడేసిన భార్య.. నాసా శాస్త్రవేత్తలను రంగంలోకి దింపిన భర్త..

Xiaomi  విష‌యానికి వ‌స్తే.. రొటీన్ IT విధానం కొనసాగుతోందని స‌మాచారం. మిగితా కంపెనీలు పన్ను ఎగవేసినట్టు నిరూపించే డిజిటల్‌ సమాచారాన్ని గుర్తించి, సీజ్‌ చేసినట్టు సమాచారం. చైనీస్ మొబైల్ కంపెనీల గోడౌన్లు (గోదాములు) పై కూడా కొన్ని బృందాలు దాడి చేశాయి. అధికారులు నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

Read Also : శత్రుదేశానికి అనుకోకుండా లక్షల డాలర్లు పంపిన తాలిబాన్లు.. ‘తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు’

 Xiaomi ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. త‌మ కంపెనీ బాధ్యతాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నీ, తాము భారతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.  భారత్‌లో పెట్టుబడి పెట్టబడిన భాగస్వామిగా, తాము అధికారులకు అవసరమైన అన్ని సమాచారాన్ని కలిగి ఉండేలా వారికి పూర్తిగా సహకరిస్తున్నామ‌ని  Xiaomiకంపెనీ ప్రతినిధి తెలిపారు.

Read Also : ఇజ్రాయెల్ లో తొలి ఒమిక్రాన్ మరణం.. నాలుగో డోసుకు కసరత్తు...

 అలాగే.. OPPO ప్ర‌తినిధి మాట్లాడుతూ.. తాము భార‌త దేశ చట్టాల‌ను ఎంత‌గానో గౌరవిస్తున్నామ‌నీ, ఆ చ‌ట్టాల‌ను కట్టుబడి ఉంటామ‌ని తెలిపారు. ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్టు ఒప్పో వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో టెలికం పరికరాల విక్రయంలో ఉన్న చైనాకు చెందిన జడ్‌టీఈపైనా ఐటీ తనిఖీలు జరిగాయి.  ఈ దాడులు స్వ‌ర‌త్రా చ‌ర్చ‌నీయంగా మారాయి.

click me!