తమిళనాడులో ఒమిక్రాన్ టెన్షన్.. విదేశాల నుంచి వచ్చిన 82 మందిలో వైరస్ ఛాయలు..

Published : Dec 23, 2021, 07:53 AM IST
తమిళనాడులో ఒమిక్రాన్ టెన్షన్.. విదేశాల నుంచి వచ్చిన 82 మందిలో వైరస్ ఛాయలు..

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరిగేనా? అన్న టెన్షన్ తప్పడంలేదు. విదేశాల నుంచి వచ్చిన 82 మందిలో ఆ వైరస్ ఛాయలు ఉండడంతో శాంపిల్స్ ను పరిశోధనకు పంపించారు. ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక, నైజీరియా నుంచి వచ్చిన రోగి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్య వర్గాలు ప్రకటించాయి. 

చెన్నై :  Tamil Naduరాష్ట్రంలో Omicron cases పెరిగేనా? అన్న టెన్షన్ తప్పడంలేదు. విదేశాల నుంచి వచ్చిన 82 మందిలో ఆ వైరస్ ఛాయలు ఉండడంతో శాంపిల్స్ ను పరిశోధనకు పంపించారు. ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక, 
Nigeria నుంచి వచ్చిన రోగి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్య వర్గాలు ప్రకటించాయి. ఇక శాంపిల్స్ పరిశోధన నిమిత్తం బెంగళూరుకు పంపించారు. 

ఇందులో కొందరికి ఒమిక్రాన్ వైరస్ సోకి ఉండే అవకాశం  ఉండడంతో కింగ్స్ ఆస్పత్రి వైద్య పర్యవేక్షణలో ఉంచారు. వీరి పరిశోధన ఫలితం గురువారం ఉదయం అందే అవకాశం ఉంది. దీంతో వైరస్ టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో బుధవారం టాంజానియా నుంచి నెల్లైకు వచ్చిన యువకుడి లోనూ ఒమిక్రాన్ ఛాయలు వెలుగుచూశాయి. ఇక, Kenya to Chennai మీదుగా తిరుపతికి వెళ్ళిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి వైద్య వర్గాలకు సమాచారం అందించారు. 

Punjab Govt సంచ‌ల‌న నిర్ణ‌యం.. నో వ్యాక్సిన్ సర్టిఫికెట్..నో శాలరీ..

సరిహద్దుల్లో అలర్ట్
ఓవైపు Andhra Pradesh లో రెండు కేసులు, మరోవైపు కేరళ లో ఏకంగా మొత్తం 24 మంది ఒమిక్రాన్‌ బారిన పడిన పడడంతో తమిళనాడు సరిహద్దుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని పరిశోధించి అనుమతించేందుకు చర్యలు తీసుకున్నారు. సరిహద్దుల్లో అదనంగా వైద్య బృందాల్ని నియమించే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ మరోసారి హెచ్చరించడం గమనార్హం.

కోలుకుంటున్న రోగి
నైజీరియా నుంచి వచ్చిన ఒమిక్రాన్‌ బారినపడ్డ రోగికి కింగ్స్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందించడంతో కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు. బుధవారం కీల్పాకం ఆస్పత్రిలో వైద్య సేవల వివరాలు పేర్కొంటూ, డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇదే తరహా బోర్డులు 25 ఆస్పత్రిలో వారం రోజుల్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అలాగే కొత్తగా ఏర్పాటవుతున్న ఆస్పత్రిలోనూ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒమిక్రాన్‌ ఛాయలకు సంబంధించి కొందరికి చికిత్స అందిస్తున్నామని వారి పరిశోధన నివేదిక మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.

భారత పౌరసత్వం కోసం 7306 మంది పాకిస్థానీల దరఖాస్తులు..

ఇదిలా ఉండగా, మహమ్మారి మరోసారి ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పంజా విసురుతున్నది. ఈ తరుణంలోనే వచ్చే ఏడాది తొలినాళ్లలో Uttar Pradesh సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో Assembly Elections నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి. ఒమిక్రాన్ విజృంభిస్తే.. జనవరి లేదా ఫిబ్రవరిల్లో వేవ్ పీక్ స్టేజ్‌లో ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కరోనా కట్టడికి ఉత్తరప్రదేశ్ తీసుకుంటున్న చర్యలు వెల్లడించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !