అలువా చిన్నారి హత్య కేసు : నిందితుడు అసఫాక్ ఆలమ్‌కు ఉరిశిక్ష

By SumaBala Bukka  |  First Published Nov 14, 2023, 11:37 AM IST

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి బాలల దినోత్సవం నాడు ఉరిశిక్ష విధిస్తూ కేరళలోని పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది.


అలువా : కేరళలోని అలువాలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు అష్ఫాక్ ఆలంకు ఎర్నాకులం పోక్సో కోర్టు మంగళవారం (నవంబర్ 14) ఉరిశిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించింది. నిందితుడికి గరిష్టంగా మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ నవంబర్ 9 గురువారం పునరుద్ఘాటించింది. 

నిందితుడు చిన్నారి పట్ల ప్రవర్తించి తీరు చాలా దారుణమని, హేయమని తెలిపింది. చిన్నారిపై అత్యాచారం తర్వాత, గోనెసంచిలో కుక్కి చెత్త డంప్ లో వేశాడు. కనీసం చెత్తడంప్ లోని దుర్వాసనను పీల్చుకోవడానికి కూడా వీలులేనంత దారుణంగా చిన్నారిని మూట కట్టాడని... ప్రాసిక్యూషన్ ఎత్తి చూపింది.

Latest Videos

కేరళలో 5 ఏళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం.. చిత్రహింసలు పెట్టి చంపి, మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి..

నిందితుడు ఢిల్లీలో మరో చిన్నారిపై కూడా గతంలో వేధింపులకు పాల్పడ్డాడని, నిందితుడికి మరణశిక్ష కంటే తక్కువ శిక్ష తప్పదని ప్రాసిక్యూషన్ వాదించింది. తాను నేరం చేయలేదని నిందితుడు కోర్టులో పదేపదే చెప్పాడు. నిందితుడిపై ఉన్న 16 నేరాల్లో సాధారణమైన మూడు సెక్షన్లలో ఎలాంటి శిక్ష ఉండదు. ఇలాంటి సెక్షన్లలో ఎక్కువ శిక్షలు ఉన్నందున 13 సెక్షన్లలో శిక్ష విధించబడుతుంది.

జూలై 28న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భయంకరమైన సంఘటన జరిగింది. కొచ్చి సమీపంలోని అలువాలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబంలోని చిన్నారి కిడ్నాప్ అయ్యింది. ఆ చిన్నారికి స్వీట్లు ఆశచూపించి తనతో తీసుకుపోయాడు నిందితుడు. దాదాపు ఒక రోజు తర్వాత ఐదేళ్ల బాలిక నిర్జీవ మృతదేహం చెత్త డంప్ యార్డ్‌లో దొరికింది. 

ఈరోజు తెల్లవారుజామున బాలిక తల్లిదండ్రులు ఆసియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ అస్ఫాక్ ఆలంకు మరణశిక్ష విధించాలని కోరారు. నిందితుడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడని, మరెవ్వరికీ ఇలాంటి దుస్థితి రాకూడదని వారు అన్నారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని, అంతకంటే తక్కువ శిక్ష ఏమీ కోరడం లేదని బాలుడి తండ్రి అన్నారు. తమ బిడ్డను చంపిన వాడికి బతికే హక్కు లేదు. బయటకు వస్తే అదే పునరావృతం చేస్తాడని ఆందోళన వ్యక్తం చేశారు. 

click me!