ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, ఒకరు సజీవదహనం..

భవనంలో 60 మందికి పైగా ఉన్నారని... భవనంపై నుంచి దూకి చాలా మంది ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు.

Google News Follow Us

న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలో నివాస భవనంలో మంటలు చెలరేగడంతో ఒక మహిళ మరణించగా, యేడాది చిన్నారి సహా 26 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి మంటలు చెలరేగినప్పుడు భవనంలో 60 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.

భవనంలో 60 మందికి పైగా ఉన్నారని... భవనంపై నుంచి దూకి చాలా మంది ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు. "తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలోని నివాస భవనంలో నిన్న రాత్రి మంటలు చెలరేగడంతో ఒక మహిళ మరణించింది. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, 26 మందిని రక్షించి, మంటలను ఆర్పింది" అని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు.

Delhi Air pollution: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్య విస్ఫోటనం ! హానిక‌ర స్థాయికి ప‌డిపోయిన గాలి నాణ్య‌త

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని గంటలపాటు మంటలను ఆర్పడంతో మంటలను ఆర్పినట్లు వారు తెలిపారు అగ్నిమాపక సిబ్బంది భవనం కిటికీ పక్కన నిచ్చెన వేసి ప్రజలను ఒక్కొక్కరిని రక్షించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.