హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎప్పటి వరకంటే..?

Siva Kodati |  
Published : Nov 11, 2022, 08:02 PM ISTUpdated : Nov 11, 2022, 08:04 PM IST
హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎప్పటి వరకంటే..?

సారాంశం

హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం వెలువడే ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిషేధం అమల్లో వుండనుంది. 

హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం వెలువడే ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12వ తేదీన.. గుజరాత్‌లో డిసెంబర్ 1, 8 తేదీల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951లోని సెక్షన్ 126ఏలోని సబ్ సెక్షన్ (ఎల్) కింద సక్రమించిన అధికారులను వినియోగించుకుంటూ ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. 

ఇకపోతే... హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. శనివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికకు 48 గంటల ముందు నుంచి ప్రచారంపై అమలు నిషేధం అమల్లోకి వచ్చింది. పోలింగ్ తేదీల విడుదలకు ముందు నుంచే పార్టీలు ఇక్కడ ప్రచారం మొదలు పెట్టాయి. కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఆప్ ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నది. అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేశాయి.

Also Read:హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర.. శనివారం పోలింగ్.. కీలక వివరాలు ఇవే

నవంబర్ 12వ తేదీన పోలింగ్ జరగబోతున్న రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ గట్టిగానే క్యాంపెయిన్‌లు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరే తమను మళ్లీ అధికారంలోకి తెస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నది. కాగా, అధికార పార్టీ ఇచ్చిన హామీలు గాలికి వదిలిపెట్టారని, అవే తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తున్నది. బీజేపీ వైపు పార్టీ సీనియర్ నేతలు రాష్ట్రంలో పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ రాష్ట్రంలో క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ ఈ రాష్ట్రంలో ప్రచారం చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 43, కాంగ్రెస్ 22 స్థానాలను దక్కించుకున్నాయి. జనవరి 8, 2023తో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu