
చాలా కాలం తర్వాత షారూక్ ఖాన్ కి పఠాన్ మూవీతో హిట్ దొరికింది. ఈ మూవీ అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ విడుదలై, కొన్ని నెలలు గడుస్తున్నా, ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఈ మూవీలోని యాక్సన్ ఎపిసోడ్స్, పాటలకు అందరూ ఫిదా అయిపోయారు. తాజాగా, ఓచిన్నారి ఈ మూవీలోని పాటలకు స్టెప్పులు వేయడానికి ప్రయత్నించింది. ఆ వీడియోని చిన్నారి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్త వైరల్ గా మారాయి. ఆ చిన్నారి పాటలో దీపికా వేసిన స్టెప్పు వేయడానికి ప్రయత్నిస్తుండటం విశేషం.
బేషరమ్ రంగ్ లో దీపిక వేసిన స్టెప్ ని కాపీ చేయడానికి ప్రయత్నిస్తించింది. ఈ వీడియోని పటోడిస్ ఏరోనిక్ లైఫ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను 4 లక్షలకు పైగా వీక్షించారు.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, టీవీలో బేషరమ్ రంగ్ మ్యూజిక్ వీడియోను చూస్తున్న చిన్న అమ్మాయిని మీరు చూడవచ్చు. ఆమె వీడియో నుండి దీపికా పదుకొణె స్టెప్పులను అనుకరించటానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఆమె ప్రో లాగా డ్యాన్స్ చేయదు, కానీ ఆమె ఏమి చేస్తుందో ఆమెకు తెలుసు. ఆమె వేస్తున్న ముద్దు ముద్దు స్టెప్స్ అందరినీ మెప్పిస్తున్నాయి. అందరూ ఆ చిన్నారి డ్యాన్స్ కి ఫిదా అయిపోయారు.
బుల్లి దీపికా, సూపర్ క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసి సరదాగా నవ్వుకోండి.