Akash Missile:  ఏకకాలంలో నాలుగు లక్ష్యాలను చేధించే ‘ఆకాశ్’

Published : Dec 18, 2023, 06:56 AM IST
Akash Missile:  ఏకకాలంలో నాలుగు లక్ష్యాలను చేధించే ‘ఆకాశ్’

సారాంశం

Akash Missile:  ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయవచ్చు. గగనతలంలో ఉన్న నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ధ్వంసం చేసే శక్తి, 25 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించే సామర్థ్యం ఉన్న ఏకైక అస్త్రమే ఆకాష్ మిస్సెల్. భారత్ సొంతం..  

Akash Missile: రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన విజయాన్ని సాధించింది. సరిహద్దుల్లో అటు పాకిస్థాన్‌, ఇటు చైనాతో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో  భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత బలోపేతంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించిన స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ ముందడుగువేసింది.

ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం. గగనతలంలో ఉన్న నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ధ్వంసం చేసే శక్తి.  25 కిలోమీటర్ల పరిధిలోని ఉన్న లక్ష్యాలను సైతం కచ్చితంగా ఛేదించే సామర్థ్యం గల ఓ అస్త్రాన్ని డీఆర్డీఓ తయారు చేసింది. అదే.. ఆకాష్ మిస్సెల్.  ఇప్పుడూ భారత్ సొంతమనీ, ఆకాశ్ క్షిపణి ప్రత్యేకత గురించి  డీఆర్‌డీవో ఆదివారం సమాచారం ఇచ్చింది. ఒకే ఫైరింగ్‌‌తో రెండు లాంచర్ల నుంచి ఏకకాలంలో రెండు మిస్సైళ్లు రిలీజ్ చేసి.. కచ్చితమైన గగనతల లక్ష్యాలను చేధించే సామర్థం ఆకాష్ క్షిపణి వ్యవస్థకు ఉందనీ, దీనిని అత్యాధునిక ఆయుధంగా పరిగణించనున్నట్లు DRDO తెలిపింది.  

 ఆంధ్రప్రదేశ్‌లోని సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో అస్త్రశక్తి 2023 విన్యాసాల సందర్భంగా స్వదేశీ ఆకాష్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. వార్తా సంస్థ ANI ప్రకారం.. భారత వైమానిక దళం నిర్వహించిన అస్త్రశక్తి వ్యాయామంలో, ఒకే ఆకాష్ క్షిపణి వ్యవస్థ ఏకకాలంలో 4 మానవరహిత వైమానిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. 4 లక్ష్యాలను చేధించే సత్తా ఉన్న తొలి దేశంగా భారత్‌ అవతరించింది. ఒకే ఫైరింగ్ యూనిట్‌ని ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా దాదాపు 25 కి.మీ దూరంలో ఉన్న 4 లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యం ఆకాష్ సొంతమని తెలిపింది డీఆర్డీఓ. ఆకాష్ మిస్సెల్స్ లో  ఫైరింగ్ యూనిట్ ఫైరింగ్ లెవల్ రాడార్ (FLR), ఒక ఫైరింగ్ కంట్రోల్ సెంటర్ (FCC), రెండు ఆకాష్ ఎయిర్ ఫోర్స్ లాంచర్లు (AAFL), 5 సాయుధ క్షిపణులతో మోహరించబడి ఉంటుంది. 

రక్షణ ఎగుమతుల్లో భారత్  

ఆకాష్ క్షిపణి వ్యవస్థతో పాటు, డోర్నియర్-228 ఎయిర్‌క్రాఫ్ట్, 155 ఎంఎం అధునాతన ఆర్టిలరీ గన్, బ్రహ్మోస్ క్షిపణి , ల్యాండ్‌మైన్ పేలుడు సంభవించినప్పుడు కూడా సురక్షితంగా ఉండే వాహనాలను కూడా భారతదేశం ఎగుమతి చేస్తుంది. ఇది కాకుండా.. అనేక అధునాతన ఆయుధాలు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలు, వైమానిక పరికరాలు , చిన్న ఆయుధాలు కూడా ఎగుమతి చేయబడతాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!