
ముంబయి: శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శనివారం ఎన్సీపీ నేత అజిత్ పవార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ మహారాష్ట్ర చసీఎం అయ్యే సామర్థ్యం కలవాడని పేర్కొన్నారు. ఆయనకు పాలనలో విస్తృతమైన అనుభవం ఉన్నదని వివరించారు. అయితే, అజిత్ పవార్ సీఎం పోస్టుపై వ్యాఖ్యలు చేసిన తరుణంలో సంజయ్ రౌత్ ఈ వాగ్బాణం విడిచారు.
అజిత్ పవార్‌కు బీజేపీకి దూరం కరిగిపోయినట్టు తెలుస్తున్నది. ఆయన బీజేపీకి మద్దతుగా నిలబడే అవకాశాలు ఉన్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అజిత్ పవార్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కావాలని తనకు 100 శాతం కాంక్షిస్తానని పేర్కొన్నారు. ఒక వేళ సీఎం పోస్టు కావాలనుకుంటే ఎన్సీపీ 2024 ఎన్నికల వరకు ఆగాల్సిన అవసరం లేదని, ఇప్పుడు కూడా ఆ పని చేయవచ్చని వివరించారు.
Also Read: ఇవాళ చొక్కాలు విప్పుతున్నారు, రేపు ప్యాంటు విప్పుతారు, మరొకరు ఇంకోటి..: వైసీపీపై బీజేపీ విమర్శలు
అనంతరం, సంజయ్ రౌత్ మాట్లాడుతూ, సీఎం కావాలని ఎవరికి ఉండదూ? అదీగాక, అజిత్ పవార్‌కు సామర్థ్యం, అనుభవం ఉన్నదని అన్నారు. ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారని, పలుమార్లు మంత్రిగా చేశారని వివరించారు. డిప్యూటీ సీఎంగా ఆయన రికార్డు సార్లు పని చేసి ఉంటారని తెలిపారు.
సంజయ్ రౌత్ శనివారం విలేకరులతో మాట్లాడుతుండగా.. అజిత్ పవార్ సీఎం సీటు గురించి మాట్లాడినట్టు విలేకరులు గుర్తు చేశారు. దీంతో సీఎం సీటు కోసం అజిత్ పవార్ చాలా సార్లు బహిరంగంగా మాట్లాడారని, ఆయనకు తన విషెస్ అని పేర్కొన్నారు.