నేడు కర్ణాటకు రాహుల్ గాంధీ.. ఎన్నికల రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన

Published : Apr 23, 2023, 02:21 AM IST
నేడు కర్ణాటకు రాహుల్ గాంధీ.. ఎన్నికల రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన

సారాంశం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం కర్ణాటకకు చేరుతారు. రెండు రోజుల పర్యటన చేయబోతున్నారు. ఈ రెండు రోజులూ ఆయన షెడ్యూల్ బిజీగా సాగుతున్నది.  

బెంగళూరు: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు ఎన్నికల రాష్ట్రం కర్ణాటకు వస్తారు. రెండు రోజుల పాటు ఈ రాష్ట్రంలో పర్యటిస్తారు. ఆయన తన రెండు రోజుల పర్యటనలో ఆలయాల సందర్శన, ప్రజలతో చర్చలు, బహిరంగ సభలో ప్రసంగాలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ శనివారం వెల్లడించింది.

ఆయన షెడ్యూల్ ఇలా సాగనుంది. ఢిల్లీ నుంచి కర్ణాటకలోని హుబ్బలికి ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో బగల్‌కోటెలోని కూడల సంగమకు బయల్దేరుతారు. 

లింగాయతుల ప్రధాన దేవస్థానాల్లో కూడల సంగమ ఒకటి. కర్ణాటకలో లింగాయతుల ప్రభావం ఎక్కువే అని తెలిసిందే. ఆయన సంగమనాథ టెంపుల్, ఐక్య లింగలో ప్రార్థన చేస్తారు. అనంతరం, బసవ మంటప ఉత్సవ సమితి నిర్వహిస్తున్న బసవ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. 

ఆ తర్వాత విజయపురలో శివాజీ సర్కిల్ వద్ద ఆయన జన సంపర్క కార్యక్రమంలో పాల్గొంటారు. 

సోమవారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ చెరుకు వ్యవసాయ ధారులతో మాట్లాడతారు. ముఖ్యంగతా బెళగావి రామదుర్గ ఏరియాలో ఆయన వారితో ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత గదగ్ వెళ్లిపోయి యువ సంవాద్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం పూట ఆయన హావేరి జిల్లాలో హంగల్‌లో బహిరంగ సభలో మాట్లాడతారు.

Also Read: బహిరంగంగా 40 శాతం కమీషన్ తీసుకుంటున్న బీజేపీ.. క‌ర్నాట‌క‌ ప్రజలు కాంగ్రెస్ ను కోరుకుంటున్నారు.. : ఖర్గే

అదే రోజు రాత్రి ఆయన హుబ్బలికి తిరిగి వెళ్లుతారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు. కర్ణాటకలో రెండు వారాల వ్యవధిలోనే రాహుల్ గాంధీది ఇది రెండో పర్యటన.

జై భారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన ఏప్రిల్ 16వ తేదీన కోలార్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu