Ajit Doval : జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్‌ దోవల్.. ఎందుకంటే..?

By Mahesh Rajamoni  |  First Published Jun 13, 2024, 7:41 PM IST

Who is Ajit Doval : మాజీ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్ ను జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)గా, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీకే మిశ్రాను ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వం మ‌రోసారి తిరిగి నియమించింది.


Ajit Doval : మాజీ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ)గా, మాజీ ఐఎఎస్ అధికారి డాక్టర్ పీకే మిశ్రాను ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గురువారం తిరిగి నియమించింది. ఇద్దరు అధికారుల ప‌దవీకాలం ముగియ‌డంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. 10.06.2024 నుండి అమల్లోకి వచ్చేలా జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది సంబంధిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, జూన్ 10 నుండి అమలులోకి వచ్చేలా ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా డాక్టర్. పీకే మిశ్రా నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిందని తెలిపింది. కాగా, అజిత్ దోవల్ 31 మే 2014న ప్రధానమంత్రికి జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన సంగ‌తి తెలిసిందే.

ఎవ‌రీ అజిత్ దోవ‌ల్? 

Latest Videos

అజిత్ కుమార్ దోవల్ భారత ప్రధానికి ఐదవ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ). కేరళ కేడర్‌కు చెందిన ఈ రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (ఐపీఎస్) అధికారి.. మాజీ ఇండియన్ ఇంటెలిజెన్స్  అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ గా కూడా విధులు నిర్వ‌ర్తించారు. 1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన ఆయ‌న భారతదేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన పోలీసు అధికారిగా కీర్తి చక్ర మెరిటోరియస్ సర్వీస్, సైనిక సిబ్బందికి గాలంటరీ అవార్డును అందుకున్నారు. సెప్టెంబర్ 2016 భార‌త‌ సర్జికల్ స్ట్రైక్, ఫిబ్రవరి 2019 పాకిస్తాన్ సరిహద్దులో బాలాకోట్ వైమానిక దాడులు అజిత్ దోవల్ పర్యవేక్షణలో జరిగాయి. ఆయ‌న డోక్లామ్ ప్రతిష్టంభనను ముగించడంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటును పరిష్కరించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు.

టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే తొలి భార‌త బౌలర్ గా అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డ్

దోవల్ 1968లో ఐపీఎల్ అధికారిగా తన పోలీసు వృత్తిని ప్రారంభించాడు. మిజోరం, పంజాబ్‌లలో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలను అణ‌చివేయ‌డంలో కీల‌కంగా ఉన్నారు. 1999లో కాందహార్‌లో హైజాక్ చేయబడిన IC-814 నుండి ప్రయాణీకులను విడుదల చేయడంలో ముగ్గురు సంధానకర్తలలో ఒకరిగా కీలక పాత్ర పోషించాడు. 1971-1999 మధ్యకాలంలో కనీసం 15 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాల హైజాకింగ్‌లను అడ్డుకోవ‌డంలో విజయవంతంగా ముగించారు. దోవల్ ఏడేళ్లపాటు పాకిస్థాన్‌లో రహస్య కార్యకర్తగా చురుకైన మిలిటెంట్ గ్రూపులపై నిఘా ఉంచి వివ‌రాలు సేక‌రించ‌డం, సీక్రెట్ ఏజెంట్‌గా ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో ఆరేళ్లపాటు పనిచేశారు.

1984లో ఖలిస్తానీ ఖలిస్థానీ మిలిటెన్సీని ఉక్కిరిబిక్కిరి చేయడానికి 'ఆపరేషన్ బ్లూ స్టార్' కోసం నిఘాను సేకరించడంలో దోవల్ కీలక పాత్ర పోషించాడు. అజిత్ దోవల్ తన కెరీర్‌లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో యాక్టివ్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా గడిపారు. అనేక ప్రసిద్ధ అవార్డులు, సత్కారాలు, రికార్డులతో దోవల్ తీవ్రవాదం-ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన వైఖరిని తీసుకున్నందుకు మంచి గుర్తింపు సాధించారు. 2009లో పదవీ విరమణ చేసిన తర్వాత, దోవల్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ గా మారారు. 2019లో, దోవల్‌ను మరో ఐదేళ్ల పాటు జాతీయ భద్రతా సలహాదారుగా మళ్లీ నియమించారు. ఇప్పుడు  మ‌ళ్లీ ఆయ‌న ప‌ద‌వీకాల‌న్ని పొడిగించారు.

సూర్య‌కుమార్ యాద‌వ్ సూప‌ర్ ఇన్నింగ్స్.. కానీ, చెత్త రికార్డు

 

click me!