Latest Videos

ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన కేంద్రమంత్రులు వీరే... రాజీవ్ చంద్రశేఖర్ ఓడినా అద్భుతమే చేసారు...

By Arun Kumar PFirst Published Jun 13, 2024, 1:29 PM IST
Highlights

గత లోక్ సభ ఎన్నికల్లో బిజెపి అనుకున్న ఫలితం రాలేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో బిజెపి అద్భుతం చేసింది. అలాంటివాటిలో కేరళ ఒకటి. ఇక్కడ బిజెపి ఓచోట గెలవడమే కాదు మరోచోట గెలిచినంత పనిచేసింది.

న్యూడిల్లీ : ముచ్చటగా మూడోసారి దేశంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఊహించని స్థాయిలో బిజెపికి సీట్లు దక్కలేవు... చార్ సౌ పార్ అన్న నినాదంతో బరిలోకి దిగితే కనీసం 300 సీట్లు కూడా సాధించలేకపోయింది. చివరకు వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకానొక దశలో వెనకబడ్డారు... కొందరు కేంద్ర మంత్రులు సైతం ఓటమిపాలయ్యారు. బిజెపి సొంతంగా  మెజారిటీ సాధించలేదు... కానీ ఎన్డిఏలోని మిత్రపక్షాల సాయంతో వరుసగా మూడోసారి కూడా బిజెపి ప్రభుత్వం ఏర్పడింది.    

అయితే కొందరు మాజీ కేంద్ర మంత్రులు ఎన్నికల్లో ఓడినా అద్భుతం చేసారు... అసలు బిజెపి గెలుపే అసాధ్యం అనుకున్న చోట కూడా పోరాటపటిమ చూపించారు.  అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజీవ్ చంద్రశేఖర్ గురించి. అసలు బిజెపి ఇప్పటివరకు గెలుపన్నదే ఎరగని కేరళలో ఆయన పోటీచేసారు... అందులోనూ కాంగ్రెస్ కంచుకోట తిరువనంతపురంలో... శశి థరూర్ వంటి సీనియర్ పై. ఇలా బిజెపికి అస్సలు ఓట్లులేని చోట రాజీవ్ చంద్రశేఖర్ భారీ ఓట్లు సాధించడమే కాదు గెలిచినంత పనిచేసారు.  

ఈజీగా గెలుస్తాడని అనుకున్న శశి థరూర్ కు రాజీవ్ చంద్రశేఖర్ చుక్కలు చూపించారు. ఆయన కేవలం నెల రోజులు మాత్రమే ప్రచారం చేసారు... అంతదానికే ఈ స్థాయి పోరాటం చేసారు. కాంగ్రెస్ హేమాహేమీ నాయకుల్లో ఒకరైన శశి థరూర్ కేవలం 16 వేల ఓట్లతో గెలిచారంటేనే రాజీవ్ చంద్రశేఖర్ ఏ స్థాయిలో పోరాడారో అర్థం చేసుకోవచ్చు. మరికొంత సమయం దొరికివుంటే ఖచ్చితంగా శశి థరూర్ ను రాజీవ్ చంద్రశేఖర్ ఓడించి చరిత్ర సృష్టించేవారని బిజెపి నాయకులు చెబుతున్నారు. 

ఇక గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఓడించి మోదీ కేబినెట్ లో చోటుదక్కించుకున్న స్మృతి ఇరానీ కూడ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. అమేథీ లోక్ సభ నుండి బిజెపి తరపున పోటీచేసిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ శర్మ చేతిలో ఏకంగా 1,67,196 ఓట్ల తేడాతో ఓడిపోయింది.  

మరో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రాకు కూడా ఓటమి తప్పలేదు. లఖీంపూర్ ఖేరి ఘటనతో ఈయన వ్యవహారం వివాదాస్పదంగా మారింది... ఇదే ఆయన ఓటమికి దారితీసింది. సమాజ్ వాది పార్టీ అభ్యర్థి ఉత్కర్ష్ వర్మ మాదుర్ చేతిలో 34,329 ఓట్ల తేడాతో అజయ్ మిశ్రా ఓడిపోయారు. 

విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన  సుభాష్ సర్కార్ కూడా ఓటమిపాలయ్యారు. ఆయన బంకురా లోక్ సభ నుండి పోటీచేసారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరూఫ్ చక్రవర్తి 32,778 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన కేంద్ర మంత్రుల్లో అర్జున్ ముండా ఒకరు. జార్ఖండ్ కు చెందిన ఈయన గత మోదీ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాలి చరణ్ ముండా చేతిలో ఏకంగా 1,49,675 ఓట్ల తేడాతో ఈయన ఓడిపోయారు. 

కైలాష్ చౌదరి... ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓడిన మరో కేంద్ర మంత్రి. రాజస్థాన్ లోని బార్మర్ లోక్ సభ నుండి పోటీచేసిన ఈయన భారీ ఓటమిని చవిచూసారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉమ్మేదా రామ్ బెనివాల్, ఇండిపెండెంట్ అభ్యర్థి రవీంద్ర సింగ్ భాటి కంటే వెనకబడి 4,17,943 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

తమిళనాడులో ఓటింగ్ శాతం పెరిగినా సీట్లు మాత్రం సాధించలేకపోయింది బిజెపి. చివరకు కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ కూడా ఓటమిపాలయ్యారు. ఎస్సీ రిజర్వుడ్ నీలగిరి లోక్ సభ నుండి పోటీచేసిన మురుగన్ డిఎంకే నేత రాజా చేతిలో ఓడిపోయారు. 

ఈ ఎన్నికల్లో నితీశ్ ప్రామాణిక్, సంజీవ్ బల్యన్,  కపిల్ పాటిల్, రావోసాహెబ్ దన్వే, భారతీ పవార్,  కౌశల్ కిషోర్ వంటి కేంద్ర మంత్రులు కూడా ఓటమిపాలయ్యారు. కర్ణాటకలో మంచి ఫలితమే వచ్చినా బీదర్ లోక్ సభలో మంత్రి భగవంత్ కూబా ఓడిపోయారు.  మురళీధరన్, మహేంద్రనాథ్ పండే,  సాధ్వి నిరంజన్ జ్యోతి, భానుప్రతాప్ సింగ్,  రాజ్ కుమార్ సింగ్, దేభశ్రీ చౌదరీ వంటి కేంద్ర మంత్రులు ఈ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.  
  

click me!