‘‘టీ, పకోడా’’.. షీలా దీక్షిత్ పనితీరును గుర్తుచేస్తూ కేజ్రీవాల్‌కు అజయ్ మాకెన్ సలహా..!!

Published : May 21, 2023, 02:08 PM ISTUpdated : May 21, 2023, 02:18 PM IST
‘‘టీ, పకోడా’’.. షీలా దీక్షిత్ పనితీరును గుర్తుచేస్తూ కేజ్రీవాల్‌కు అజయ్ మాకెన్ సలహా..!!

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలోని అధికారులను బదిలీ చేసే హక్కు ఎవరికి ఉంటుందన్న అంశంపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య వాగ్వాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ పని తీరుకు సంబంధించి కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ ట్వీట్‌ చేశారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అధికారులను బదిలీ చేసే హక్కు ఎవరికి ఉంటుందన్న అంశంపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య వాగ్వాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో అధికారుల బదిలీ-పోస్టింగ్ హక్కును రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం మళ్లీ అందులో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జోక్యం చేసుకునేలా చేసింది. ఈ మేరకు నేషనల్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ పని తీరుకు సంబంధించి కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘షీలా జీతో ఒక రోజు’’ అని పేర్కొన్నారు. 

‘‘2000వ దశకం ప్రారంభంలో ఢిల్లీ చారిత్రాత్మక మార్పుకు లోనవుతోంది. నేను ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నేతృత్వంలో రవాణా, విద్యుత్, పర్యాటక శాఖ మంత్రిగా పని చేస్తున్నాను. ప్రజా రవాణాను సీఎన్‌జీకి మార్చడం, మెట్రోను ప్రారంభించడం, విద్యుత్ శాఖను సంస్కరించడం వంటి అనేక కార్యక్రమాలకు నాయకత్వం మేము నాయకత్వం వహిస్తున్నాము.

అయితే అప్పుడు ఒకరోజు ఉదయం నేను కలతపడే వార్త చదవాల్సి వచ్చింది. నా ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ సింధుశ్రీ ఖుల్లార్‌ను భర్తీ చేయడం గురించి నేను చదివాను. అప్పుడు నా గొంతులో ఆందోళన వ్యక్తమైనట్లు నాకు గుర్తుంది. సీఎన్‌జీ మార్పిడి మధ్యలో  ఆమె లేకపోవడం అడ్డంకి కావచ్చని అని అనిపించింది. నేను షీలా జీకి నా ఆందోళనలను వినిపించాను. ‘మేడమ్.. మీరు నా ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్‌ని మార్చారు. నేను వార్తాపత్రికల ద్వారా తెలుసుకుంటున్నాను. ఇది మన సీఎన్‌జీ మార్పిడి ప్రాజెక్ట్‌ను ప్రమాదంలో పడేస్తుంది’ అని చెప్పాను. ఆమె మొదట్లో దానిని తోసిపుచ్చొరు. ‘మీకు ఎవరు చెప్పారు? పుకార్ల ఆధారంగా ఎందుకు డిస్టర్బ్‌ అవుతారు?’ అని నన్ను ప్రశ్నించారు. 

అయితే కాసేపటికే ఆ పుకార్లు రియాలిటీగా మారాయి. ‘మీరు చెప్పింది నిజమే’ అని షీలా  దీక్షిత్ అంగీకరించారు.  అయితే ఆ నిర్ణయం గురించి ఆమెకు కూడా తెలియదని చెప్పారు. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తామని తెలిపారు. సీఎన్‌జీ మార్పిడి చొరవ మధ్య లెఫ్టినెంట్ గవర్నర్ అటువంటి నిర్ణయం ఎలా తీసుకోగలరని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో మేము ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నాము. మేము లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి మా ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేసినప్పటికీ.. వెనక్కి తగ్గలేదు.  ‘నాకు ఆదేశాలు ఉన్నాయి. నేను దీన్ని తిప్పికొట్టలేను’ ఎల్‌జీ చెప్పారు.

 


నిరుత్సాహానికి గురైనప్పటికీ, షీలా జీ అనేక మంది సీనియర్ కేంద్ర ప్రభుత్వ అధికారులను పిలిచి.. ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు.. సాయంత్రం వరకు నిర్ణయం మార్చలేదు. రాజకీయంగా నడిచే ఈ అడ్డంకిని బహిర్గతం చేయడానికి నేను విలేకరుల సమావేశాన్ని ప్రతిపాదించాను. అయితే షీలాజీకి వేరే వ్యూహం ఉంది. ‘వద్దు, వద్దు.. మన వైఫల్యం గురించి ఎవరికీ చెప్పకండి. మనం ప్రయత్నించాం. విజయం సాధించలేదని అధికారులు తెలుసుకోకూడదు వారికి తెలిస్తే వారు మన మాటలను తీవ్రంగా వినడం మానేస్తారు’ అని ఆమె నాతో చెప్పారు. 

ఆమె జ్ఞానం అపారమైనది. ‘కొత్త అధికారిని పిలవండి. ఆయన నియామకం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారని చెప్పండి. సీఎన్‌జీ మార్పిడి యొక్క ప్రాముఖ్యతను వివరించండి. టీ, పకోడాల కోసం అతన్ని ఆహ్వానించండి. ఈ అధికారులు ఎవరితోనూ లేవు.. వాటిని నేర్పుగా ఎదుర్కోండి’ అని ఆమె చెప్పారు.

ఆమె తెలివిగల సలహాను అనుసరించి.. కొత్తగా నియమితులైన అధికారితో నేను టీ, పకోరాలను పంచుకుంటున్నాను. ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలను సుప్రీంకోర్టు ఖచ్చితంగా పర్యవేక్షిస్తోంది. ఢిల్లీలో సీఎన్‌జీ అమలు చేయాలి’ అని అధికారితో చెప్పాను. సంఘటనల మలుపు విశేషమైనది. కొత్త అధికారి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు. మేము వివిధ లాబీలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడ్డాం. సుప్రీంకోర్టు, యూఎస్ ప్రభుత్వం నుండి కూడా ప్రశంసలు పొందామని నేను గర్వంగా చెబుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను సీఎన్‌జీకి పూర్తిగా మార్చిన మొదటి నగరంగా మేము నిలిచాం’’ అని అజయ్ మాకెన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

‘‘షీలా దీక్షిత్ జీ ప్రభుత్వం మొదటి ఆరు సంవత్సరాలు అత్యంత ఉత్పాదక దశ. ఆమె అధికారం కోసం కాదు. ఢిల్లీ అభివృద్ధి కోసం పోరాడారు. విద్యుత్ ప్రైవేటీకరణ, సీఎన్‌జీ మార్పిడి, మెట్రో ప్రారంభం, ఫ్లైఓవర్ల నిర్మాణం, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం.. అవన్నీ ఆమె ఢిల్లీ కోసం అవిశ్రాంతంగా పోరాడినందున జరిగాయి. ఆమె నాయకత్వం, దౌత్యం గురించిన పాఠాలు నాకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అడ్డంకులను నేర్పుగా ఎదుర్కోవడం, నగర సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో సేవ చేయడం. అవసరమైనప్పుడు టీ, పకోడాలు అందించడం.. అవసరమైనప్పుడు దృఢంగా నిలబడటం ఆమె నాకు నేర్పింది. అదే షీలా జీ వారసత్వం. , అన్నిటికీ మించి ప్రజా ప్రయోజనాలను అందించడానికి మార్గదర్శకం.

ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ యాత్రను గమనించి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అధికారులతో గౌరవప్రదంగా పాల్గొనండి.. సంభాషణలు జరపండి. ఢిల్లీ అభివృద్ధి కోసం వారిని ఒప్పించండి. మీ దృష్టికి చిత్తశుద్ధి ఉంటే వారు ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఉంటారు. మీ గత చర్యలు.. అసందర్భమైన సమయాల్లో అధికారులను పిలిపించడం, అనుచితంగా ప్రవర్తించడం, కఠినమైన పదాలను ఆశ్రయించడం.. ఇది నిర్మాణాత్మకంగా లేదు. అటువంటి ప్రవర్తన నగరం దుస్థితికి మాత్రమే దోహదపడుతుందని గుర్తించడం చాలా ముఖ్యం’’ అని ఢిల్లీ  సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అజయ్ మాకెన్ సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం