పనామా పేపర్స్ లీకేజీ ఘటనకు సంబంధించి బాలీవుడ్ సినీ నటి ఐశ్వర్యరాయ్ సోమవారం నాడు ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో రెండు దఫాలు విచారణకు హాజరు కావాలని ఆమెకు సమన్లు పంపారు. అయితే ఆమె విచారణకు హాజరు కాలేదు. ఇశాళ విచారణకు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: పనామా పేపర్స్ లీక్ ఘటనకు సంబంధించి బాలీవుడ్ సినీ నటి ఐశ్వర్యరాయ్ సోమవారం నాడు ఈడీ విచారణకు హాజరయ్యారు. పనామా పేపర్స్ లీకేజీ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పనామా పేపర్స్ లీకేజీ ఘటనకు సంబంధించి ఇండియాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు బహిర్గతమయ్యాయి. ఈ విషయమై విచారణకు ఆదేశిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈడీ సహా పలు సంస్థలు ఈ విషయమై విచారణ చేపట్టనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
Panama Paper case ఘటనకు సంబంధించి విచారణకు హాజరు కావాలని గతంలో రెండు డఫాలు సినీ నటి Aishwarya Rai Bachchan కి సమన్లు పంపారు. అయితే రెండు దఫాలు ఆమె విచారణకు హాజరు కాలేదు. ఫెమాలోని సెక్షన్ 97 ప్రకారంగా నిబంధనలను ఉల్లంఘించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది నవంబర్ 9 న Enforcement Directorate అధికారులు ఆమెకు సమన్లు పంపారు. దీంతో ఇవాళ ఆమె విచారణకు హాజరయ్యారు.
undefined
also read:ED summons Aishwarya Rai: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌కు ఈడీ సమన్లు.. పనామా పేపర్ లీక్ కేసులో..
విదేశీ మారకపు ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తును ఈడీ అధికారులు విచారణను ప్రారంభించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) స్కీమ్ కింద 2004 నుండి విదేశీ చెల్లింపులపై వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గత 15 ఏళ్లుగా విదేశాల నుండి అందుకొన్న నిధుల గురించి ఐశ్వర్యరాయ్ గతంలోనే రికార్డులను సమర్పించినట్టుగా సమాచారం.పనామా పేపర్ లీకేజీ ఘటనలో ప్రపంచంలోని పలువురి పేర్లను మీడియాకు లీకయ్యాయి. ప్రపంచంలోని ధనవంతులు పన్నులు ఎగవేసేందుకు ఆఫ్‌షోర్ ఖాతాలు లేదా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకొన్నారని పనామా పేపర్స్ లీకేజీ ఘటనకు సంబంధించి జర్నలిస్టులు పరిశోధనలో వెలుగు చూశాయి. పనామా పేపర్స్ లీకైన ఘటనలో సుమారు 3 వేల మంది ఇండియన్ల పేర్లు బయటకు వచ్చాయి.11.5 మిలియన్ల పన్ను పత్రాలను పనామా పేపర్స్ లీకయ్యాయి. ఇండియాకు చెందిన సంపన్నుల జాబితాలో ఐశ్వర్యరాయ్ పేరు కూడా ఉంది.పన్నును ఎగ్గొట్టేందుకు పలువురు భారతీయులు షెల్ కంపెనీలు పెట్టారనే పనామా పేపర్స్ లీకేజీ బయటపెట్టింది.పనామా పేపర్స్ లో కనిపించిన కంపెనీలతో తమకు ఎలాంటి సంబందం లేదని అమితాబ్ కుటుంబం కొట్టిపారేసింది.
ఐశ్వర్యరాయ్ ను అడిగిన ప్రశ్నలివే
అమిక్ పార్ట్‌నర్స్ అనే కంపెనీ 2005లో బ్రిటిషన్ వర్జిన్ ఐలాండ్ లో రిజిస్టర్ చేశారు.ఈ కంపెనీతో మీకు ఉన్న అనుబంధం ఏమిటని ఈడీ ప్రశ్నించింది.మొసాక్ ఫోన్సెకా కంపెనీని రిజిస్టర్ చేసిన న్యాయ సంస్థ మీకు తెలుసా అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కంపెనీ డైరెక్టర్లుగా కోటేదాడి రమనరాయ్, కృష్ణరాయ్ , మీ తలలి కవితా రాయ్, మీ సోదరుడు ఆదిత్యరాయ్ , మీరున్నారని ఈడీ అధికారులు గుర్తు చేశారు. ఈ విషయమై మీరు ఏమైనా చెబుతారా అని ప్రశ్నించారు.2008లో కంపెనీ యాక్టివ్ గా లేకుండా పోయిందని ఈడీ అధికారులు ఆమెను అడిగారు.