Asianet News Dialogues: భూమి చుట్టూ సముద్రయానం చేసిన అభిలాష్ టామీ.. 30 వేల మైళ్ల జర్నీ గురించి ముఖ్యాంశాలు

By Mahesh KFirst Published May 29, 2023, 7:12 PM IST
Highlights

భూమి చుట్టూ సముద్రయానాన్ని రిటైర్డ్ కమాండర్ అభిలాష్ టామీ విజయవంతంగా పూర్తి చేశారు. తుఫాన్ ఉంటేనే ఆ ట్రిప్ పైసా వసూల్ చేసినట్టూ ఆయన అంటున్నారు. గోల్డెన్ గ్లోబ్ రేస్ 2022లో భాగంగా ఆయన ఈ రేసులో పాల్గొన్నారు. ఆయన జర్నీ గురించి తెలుసుకోవడానికి ఏషియానెట్ న్యూస్ డైలాగ్ ప్రత్యేక ఎడిషన్‌ను వీక్షించండి.
 

Circumnavigating: తుఫాన్ గుండా వెళ్లినప్పుడే పైసా వసూల్ ట్రిప్ జరిగినట్టు అని రిటైర్డ్ కమాండర్ అభిలాష్ టాపీ అన్నారు. గోల్డెన్ గ్లోబ్ రేస్ 2022లో భాగంగా ఆయన చేపట్టిన 30 వేల మైళ్ల సముద్రయానాన్ని గురించి మాట్లాడుతూ పై వ్యాఖ్య చేశారు. ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ స్పెషల్ ఎడిషన్ రిటైర్డ్ కమాండర్ అభిలాష్ మాట్లాడారు.

‘తొలి తుఫాన్ జనవరి 26న వచ్చింది. రెండోది ఫిబ్రవరి 7వ తేదీన వచ్చింది. రెండోసారి వచ్చిన తుఫాన్ నా బోట్‌ను రెండు సార్లు నీటితో ముంచెత్తింది. చాలా డ్యామేజీ చేసింది. నేను రిపేర్ చేస్తూనే గడిపాను. చివరకు నా విండ్ పైలట్ విరిగిపోయింది. చాలా తక్కువ సమయంలోనే నేను ఒక పరిష్కారాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. వేగంగా వీచే గాలి నన్ను చిలీ వైపు తోసేసింది. 30 నుంచి 40 నాట్ల వేగంతో గాలి వీచింది. ఇది చాలా వేగం. అంతలోనే చీకటి పడింది. చుట్టు ఎక్కడా లైట్ హౌజ్‌లు లేవు. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది.’ అని అభిలాష్ అన్నారు.

‘నిజంగా ఆ తుఫాన్‌లను నేను చాలా ఎంజాయ్ చేశా. కొన్నిసార్లు అసలు తుఫాన్‌లు లేవనీ కంప్లైంట్చేసిన సందర్భాలు ఉన్నాయి. తుఫాన్‌ల గుండా వెళ్లినప్పుడు ఆ ట్రిప్ పైసా వసూల్ చేసినట్టు అవుతుంది. కేప్ హోర్న్ పోయినప్పుడూ తుఫాన్‌లు లేవంటే అక్కడి దాకా వెళ్లి ఏం లాభం. దానికి బదులు బంగాళాఖాతంలో ఈదొచ్చు’ అని అభిలాష్ చెప్పారు.

కమాండర్ అభిలాష్ (రిటైర్డ్) తన సముద్రయానాన్ని బయనట్ పడవపై ఫ్రాన్స్ నుంచి గతేడాది సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభించారు. 236 రోజులు 14 గంటలు, 46 నిమిషాల్లో సముద్రయానం చేసి మొత్తం భూమిని చుట్టివచ్చిన తొలి ఆసియా ఖండ వాసిగా ఏప్రిల్ 29వ తేదీన అభిలాష్ రికార్డు సృష్టించారు. 

2018లో ఆయన వెన్నుపూసకు గాయమైంది. భూగ్రహంపై రిమోటెస్ట్ ప్లేస్ దక్షిణ హిందు మహా సముద్రంలో వీచిన బలమైన గాలులు, కఠినమైన సముద్రంతో ఈ గాయమైంది. అప్పుడు ఆయన ప్రయాణిస్తున్న ఎస్‌వీ తురియా పడవ కూడా డ్యామేజీ అయింది.

తన తాజా సముద్రయానాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘గాలి లేని చోట ఈదడమే.. చాలా కష్టం. గాలి లేకున్నా పడవను ముందుకు నడిపించడం నీరసంగా, ఒత్తిడిగా ఉంటుంది. అదే తుఫాన్ అయితే.. పడవను చాలా సులభంగా ముందుకు తీసుకెళ్లవచ్చు.’ అని అభిలాష్ వివరించారు.

‘నేను ఆందోళనకరమైన రెండు ఏరియాల గుండా ప్రయాణించా. ఒకటి పోర్చుగల్ సమీపంలో, తిమింగళాల జాతికి చెందిన ఒర్కస్ నా పడవపై దాడి చేశాయి. వాటి పిల్లలకు కూడా దాడి చేయడం ఎలాగో వివరించాయి. దీని వల్ల కొన్ని పడవలు మునిగిన ఉదంతాలూ ఉన్నాయి. మరొక ఏరియా పశ్చిమాఫ్రికా. అక్కడ సముద్రపు దొంగల ముప్పు ఉంటుందని నన్ను హెచ్చరించారు. అది ఏమంత సురక్షితమైన ప్రాంతం కాదు. కానీ, లక్కీగా అలాంటి సమస్యలేవీ నాకు ఎదురుకాలేవు’ అని అన్నారు.

ఆయన డైట్ గురించి మాట్లాడుతూ.. ‘నా మేనేజర్ లెక్కల ప్రకారం, నా ప్రయాణం ముగించడానికి నాకు 6 నుంచి 8 లక్షల కెలోరీలు అవసరం. ఇందు కోసం మూడు రకాల ఫుడ్ ఏర్పాటు చేశారు. ఒకటి టిన్న్‌డ్ మీట్, దీన్ని నేను వండిన అన్నంతో తినవచ్చు. డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్ నుంచీ నాకు ఫుడ్ ఇచ్చారు. ఆ ప్యాకెట్‌ను ఓపెన్ చేసి కొంచె వేడి చేసి తినేయవచ్చు. అలాగే.. ఫ్రొజెన్ ఫుడ్ కూడా ఇచ్చారు. దీనికి వేడి నీటిని కలిపితే చాలు తినేయవచ్చు. వీటికి తోడు మ్యూజ్లీ, పాలు అల్పాహారం కోసం వినియోగించుకున్నాను. అలాగే, క్యాష్యూ, పీనట్స్, పాప్ కార్న్ కూడా వెంట తీసుకెళ్లా’ అని తెలిపారు.

ఒక మంచి రోజున నేను ఐదు గంటలు నిద్రించగలను. ‘అది కూడా ఒకేసారి పడుకోలేం. పడుకోవాలి, నిద్రలేవాలి. 15 నిమిషాలు పడుకోవాలి.. మళ్లీ మేలుకుని అన్ని సరిగ్గానే ఉన్నాయా? లేదా? అని చూసుకోవాలి. ఇలా ఎనిమిది నెలలు చేస్తూనే ఉన్నాను’ అని అభిలాష్ వివరించారు.

Also Read: పాపం అమెరికా.. అరబ్ లీగ్‌లోకి సిరియా ఆగమనం.. అగ్ర దేశం మరింత దిగజారక తప్పదా?

మన దేశం నుంచి ఆర్థిక సహకారం అందకపోవడంపై ఈ రిటైర్డ్ ఇండియన్ నేవీ అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ సారి నాకో స్పాన్సర్ దొరికినందుకు సంతోషపడ్డాను. భారత స్పాన్సర్లతో నాకు మంచి అనుభవాలేమీ లేవు. సెయిలింగ్‌ను ఎందుకు సపోర్ట్ చేయరో నాకు అర్థం కాదు. 2013లో నేను తొలి సముద్రయానం (నాన్ స్టాప్‌గా మొత్తం భూమి తిరిగిరావడం) చేశాను. చాలా మంది భారతీయులు నన్ను గర్వంగా స్వాగతించారు. ఎప్పుడూ అలా జరగలేదు.2018లో నా రేస్ గురించి చాలా మీడియాల్లో కథనాలు వచ్చాయి. కానీ, సెయిలింగ్ పై ఎక్కువ మంది మక్కువ చూపరనే చాలా మంది భారతీయులు భావిస్తారని అనుకుంటాను. నాకు బయనట్ స్పాన్సర్ లభించినందుకు అదృష్టవంతుడిని. నాకు స్పాన్సర్ చేసే నిర్ణయాన్ని వారు కేవలం ఐదు నిమిషాల్లో తీసుకున్నారు. నేను కాంట్రాక్ట్ పై సంతకం పెట్టడానికి ముందే డబ్బులు రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. కాబట్టి, ఒక యూఏఈ కంపెనీ సహకారంతో భారత జెండా ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది’ అని అభిలాష్ చెప్పారు.

యువ ఈతగాళ్లను ప్రోత్సహించడానికి ఒక అకాడమీ పెట్టాలనే ఆలోచన ఆయనకు లేదని వివరించారు. ఒక ప్రైవేటు స్పాన్సర్ ముందడుగు వేస్తే దాని ద్వారా ఎంతో విలువను సంపాదించుకోవచ్చు. ఈ సారి అదే జరిగింది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణే భవిష్యత్‌లో యాచింగ్‌కూ దక్కుతుందని ఆశిస్తున్నారు.

click me!