ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం.. బాణసంచా నిషేధం గాలికి...

By SumaBala Bukka  |  First Published Nov 13, 2023, 9:26 AM IST

దీపావళి సందర్భంగా బాణసంచా నిషేధాన్ని ఢిల్లీలో దారుణంగా ఉల్లంఘించారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పటాకులు పేలిన సంఖ్య స్వల్పంగానే ఉంది.


ఢిల్లీ : కాలుష్య స్థాయిలను అరికట్టడానికి బాణాసంచాపై సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ పట్టించుకోలేదు. ఎవరేమైతే మనకేం.. మన ఆనందమే మనకు ముఖ్యం.. లాంటి ధోరణి.. మరోసారి ఢిల్లీలని కాలుష్య కోరల్లోకి నెట్టేసింది. ఢిల్లీవాసులు అధిక సంఖ్యలో బాణసంచా పేల్చడంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాలు సుప్రీంకోర్టు విధించిన నియమాలను తీవ్రస్థాయిలో ఉల్లంఘించారు. దీంతో ఆదివారం దీపావళి వేడుకల అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది.

క్రాకర్లు పేల్చడానికి పౌరులు గుమిగూడిన ముఖ్యమైన ప్రాంతాలలో షాపూర్ జాట్, హౌజ్ ఖాస్ ఉన్నాయి, సాయంత్రం 4 గంటల తర్వాత ఇది పెరిగింది. అయితే, పటాకులు కాల్చే సంఖ్య గతేడాదికంటే గణనీయంగా తక్కువగా ఉందంటున్నారు. పర్యావరణ కార్యకర్త భవ్రీన్ కంధారి తన నివాస ప్రాంతమైన డిఫెన్స్ కాలనీలో ఇలాంటి ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు.

Latest Videos

undefined

దీపావళి బోనస్ ఇవ్వలేదని.. దాబా యజమాని గొంతు కోసి, కత్తితో పొడిచి, కొట్టి.. దారుణ హత్య...

"పటాకుల పొగలో సుప్రీం కోర్టు నిబంధనలు ఆవిరైపోయాయి. హెచ్చరికలు, పూర్తి నిషేధం అమలులో అధికారులు మళ్లీ విఫలమయ్యారు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఎలాంటి వైఖరి తీసుకుంటుందోనని ఆశ్చర్యపోతున్నారా? "వేడుకల పేరుతో మనం మన పిల్లలను భయాంకరమైన కాలుష్యపు కోరల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాం”అన్నారామె.

గ్రేటర్ కైలాష్, చిత్తరంజన్ పార్క్‌లో రాత్రి 7:30 గంటల వరకు పటాకుల పేలుళ్ల తీవ్రత తక్కువగానే ఉండగా, సాయంత్రం తర్వాత అది పెరిగిందని అంచనాలు ఉన్నాయి. ఛతర్‌పూర్‌లో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే బాణాసంచా నుండి స్థిరమైన శబ్దం వచ్చింది. నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా చుట్టుపక్కల దుకాణదారులు చిన్న చిన్న పటాకులు పిల్లలకు అమ్మడం గమనించారు. ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లో కూడా అక్కడ సాయంత్రం 6:30 తర్వాత వివిధ గృహాల నుండి అడపాదడపా పటాకుల శబ్దాలు వినిపించాయి. లక్ష్మీ నగర్‌లోని లలితా పార్క్ ప్రాంతంలో పటాకుల మోత తక్కువగా వినిపించాయి. 

ఢిల్లీలోని ఇతర తూర్పు ప్రాంతాలు మితమైన స్థాయిలో బాణసంచా వాడకాన్ని అనుభవించాయి. అయితే, స్థానికుల ప్రకారం.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పటాకుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు.  తీవ్రమైన వాయు కాలుష్య సమస్యలతో సతమతమవుతున్న ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోనే కాకుండా అన్ని రాష్ట్రాలకూ బేరియం కలిగిన బాణసంచా నిషేధం విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు నవంబర్ 7న స్పష్టం చేసింది.

click me!