‘ఆపరేషన్ గంగ’లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. రొమేనియా నుంచి ఇండియాకు

Published : Feb 28, 2022, 04:39 PM ISTUpdated : Feb 28, 2022, 04:57 PM IST
‘ఆపరేషన్ గంగ’లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. రొమేనియా నుంచి ఇండియాకు

సారాంశం

‘ఆపరేషన్ గంగ’లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పాలుపంచుకున్నది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ చేపడుతున్నది. ఇందులో భాగంగా ఈ రోజు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ముంబయి నుంచి రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు వెళ్లింది. 182 మంది భారతీయులను రేపు ఉదయం 9.30 గంటల వరకు ముంబయికి తీసుకురానుంది.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ ప్రతిదాడులు చేస్తున్నది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని వదిలి పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోతున్నారు. భారత(Indians) పౌరులు, విద్యార్థులు ఆ దేశంలో చిక్కుకుని ఉన్నారు. వారిని తరలించడానికి (Evacuation) కేంద్ర ప్రభుత్వం అనేక విధాల్లో ప్రయత్నాలు చేసింది. వారిని రొమేనియా రాజధాని బుకారెస్ట్, హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లకు తరలించింది. అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తున్నది. ఈ తరలింపునే ‘ఆపరేషన్ గంగ’ (Operation Ganga)గా పేరుపెట్టింది.

తాజాగా, ఈ ఆపరేషన్ గంగలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చేరింది. ఐఎక్స్ 1201 విమానం ముంబయి నుంచి బుకారెస్ట్‌కు బయల్దేరి వెళ్లింది. బుకారెస్ట్‌కు సాయంత్రం 6.15 గంటలకు చేరుతుందని అధికారవర్గాలు తెలిపాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 182 భారతీయులను ముంబయికి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ విమానం వెళ్లింది. రాత్రి 7.15 గంటల ప్రాంతంలో తిరిగి అక్కడి నుంచి వెనక్కి బయల్దేరుతుందని వివరించాయి. అక్కడి నుంచి వచ్చి విమానం కువైట్‌లో ఆగనుంది. అక్కడ ఇంధనం నింపుకుని మళ్లీ ముంబయికి బయల్దేరుతుంది.182 మంది భారత ప్రయాణికులతో ఈ విమానం రేపు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ముంబయి చేరుతుందని తెలిపాయి.

ఉక్రెయిన్-రష్యా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తరలిస్తుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారిని సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరిలకు చేరేలా ఏర్పాట్లు చేసి.. అక్కడి నుంచి తరలింపు ప్రక్రియ చేపడున్నారు. రొమేనియా రాజధాని బుకారెస్ట్, హంగేరి రాజధాని బుడాపెస్ట్‌ల నుంచి భారత్‌కు ఎయిర్ ఇండియా ద్వారా ప్రత్యేక విమానాలను నడుపుతుంది. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ఎలాంటి వీసా లేకపోయినా తమ దేశంలోకి రావొచ్చని పోలాండ్ తెలిపిన  సంగతి తెలిసిందే. 

ఆపరేషన్ గంగాలో భాగంగా.. తొలి విమానం రొమేనియా రాజధాని  బుకారెస్ట్ నుంచి 219 మంది భారతీయలుతో శనివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. రెండో విమానం రెండో విమానం ఆదివారం తెల్లవారుజామున Delhi airportకు చేరుకుంది. ఇందులో 250 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. మూడో విమానం హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్ నుంచి బయలుదేరి ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఇందులో 240 మంది ఇండియన్స్ ఉన్నారు. నాలుగో విమానం బుకారెస్ట్ నుంచి 198 మంది భారతీయలుతో ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరింది. ఇంకా 13 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌‌లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఎంబసీ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు చెక్‌పోస్టులకు వెళ్లవద్దని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు సూచించింది. భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లు, నగదు (ప్రాధాన్యంగా US డాలర్లలో), ఇతర అవసరమైన వస్తువులు, COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లను వారి వెంట ఉంచుకోవాలని తెలిపింది.

‘ప్రభుత్వం మాకు చాలా సహాయం చేసింది. భారత రాయబార కార్యాలయం ద్వారా సాధ్యమైన అన్ని సహాయాలు అందించబడ్డాయి. ప్రధాన సమస్య సరిహద్దు దాటడం. భారతీయులందరినీ తిరిగి తీసుకువస్తారని నేను ఆశిస్తున్నాను. ఉక్రెయిన్‌లో ఇంకా చాలా మంది భారతీయులు చిక్కుకుపోయారు’ అని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఓ విద్యార్థి చెప్పారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌