
న్యూఢిల్లీ: Russia ఆర్మీ Kviv సహా Ukraine లోని పలు పట్టణాల్లో నిరంతరంగా Bomb దాడులకు దిగుతుందని భారత్ లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ Igor Polikha చెప్పారు.
సోమవారం నాడు New delhiలో ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యాతో చర్చలకు తమ ప్రతినిధి బృందం వెళ్లిన సమయంలో కూడా రష్యా దాడులను ఆపలేదని పొలిఖా వివరించారు. రష్యా బలగాలు వెనక్కు తగ్గాలంటే అంతర్జాతీయ ఒత్తిడి పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ Putin పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. రస్యా దాడిలో ఉక్రెయిన్ లో సుమారు 16 మంది చిన్నారులు కూడా మరణించారని ఆయన వివరించారు. రష్యా విమానాలకు ఐరోపాలో ఎయిర్ స్పేస్ మూసివేసిన విషయాన్ని పొలిఖా గుర్తు చేశారు.
రష్యన్ ఆర్ధిక వ్యవస్థ ప్రతి రోజూ కుంటుపడుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే రష్యాకు చెందిన 5300 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని పొలికా చెప్పారు. ఉక్రెయిన్ శరణార్దుల సంఖ్య నాలుగు లక్షలు దాటిందని పొలిఖా వివరించారు. యుద్ధాన్ని ఆపకపోతే వారి సంఖ్య 7 మిలియన్లకు చేరుకుంటుందన్నారు. తమ దేశ సరిహద్దుల్లో చాలా మంది ఇతర దేశాలకు వెళ్లేందుకు వేచి ఉన్నారని ఇగోర్ పొలిఖా తెలిపారు.
లక్ష మంది ఉక్రెయిన్ ప్రజలు సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. భారత అధికారుల వద్ద ఉన్న సమాచారమే తన వద్ద ఉందన్నారు. యుద్ధాన్ని నిలిపివేసి రష్యాపై ఒత్తిడి తేవడమే ఉక్రెయిన్ ప్రాధాన్యత అని పొలిఖా చెప్పారు. విద్యార్ధులను స్వదేశానికి రప్పించడం భారత్ ప్రాధాన్యత అయితే, రష్యాపై ఒత్తిడి తీసుకురావడం తమ ప్రాధాన్యతగా డాక్టర్ ఒగోర్ పొలిఖా అభిప్రాయపడ్డారు. తాను నిరంతరం Indian అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా పొలిఖా వివరించారు. రెండు దేశాలు శాంతిని కోరుకొంటున్నాయని పొలిఖా వివరించారు.
ఈ నెల 24వ తేదీ నుండి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది. ఉక్రెయిన్ లోని పలు నగరాలను స్వాధీనం చేసుకొనేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇవాళ చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు దేశాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. కాల్పుల విరమణను పాటించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ఎలాంటి షరతులు లేకుండానే రష్యా ఇవాళ చర్చల్లో పాల్గొంది.
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రపంచంలోని పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రష్యాపై అమెరికా సహా పలు దేశాలు తీవ్ర ఆంక్షలను విధించాయి. ఆర్ధిక ఆంక్షలను మరింత తీవ్రం చేయాలని కూడా ఈ దేశాలు భావిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ తో రష్యా చర్యలను ప్రతిపాదించింది. అయితే ఈ చర్చల నేపథ్యంలో రెండు దేశాలు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటాయనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఉక్రెయిన్ పై దాడులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 12 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఇటీవల తీర్మానం ప్రవేశ పెట్టాయి. అయితే ఈ తీర్మానంపై రష్యా వీటో పవర్ ను ఉపయోగించింది. ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. పెద్ద సంఖ్యలో సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు సైనిక బలగాలు కీవ్ నగరంలోకి ప్రవేశించాయి.