ముంబైలో అగ్ని ప్రమాదం: మంటలను ఆర్పుతున్న 10 ఫైరింజన్లు

Published : Feb 28, 2022, 04:19 PM ISTUpdated : Feb 28, 2022, 04:23 PM IST
ముంబైలో  అగ్ని ప్రమాదం: మంటలను ఆర్పుతున్న 10 ఫైరింజన్లు

సారాంశం

ముంబైలోని  ఎన్జీ రాయల్ పార్క్ రెసిడెన్షియల్ ఏరియాలో సోమవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. పది ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.   

ముంబై: మహారాష్ట్ర రాజధాని Mumbai పట్టణంలోని ఎన్జీ రాయల్ పార్క్ రెసిడెన్షియల్ ఏరియాలో సోమవారం నాడు Fire Accident సంబవించింది.  పది పైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

ముంబైలోని సబర్బన్ Kanjurmarg  NG Royal Park  రెసిడెన్షియల్ ఏరియాలో హైరైజ్  పై అంతస్థులో మంటలు వ్యాపించాయి.  అపార్ట్‌మెంట్ నుండి దట్టమైన పొగలు వస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు.

ఈ భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించారు.  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేదా గాయపడినట్టుగా  సమాచారం లేదని అధికారులు ప్రకటించారు. 


 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?