చికాగోలో చిక్కుకుపోయిన ఎయిర్ ఇండియా ప్రయాణికులు.. 24 గంటలుగా పడిగాపులు

By Rajesh KarampooriFirst Published Mar 16, 2023, 2:26 AM IST
Highlights

అమెరికాలోని చికాగో విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దయ్యింది. దీంతో 300 మంది ప్రయాణికులు అమెరికాలోని చికాగో విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఢిల్లీకి ఎప్పటిలోగా విమానంలో వెళ్తారనేది ఇంకా చెప్పలేదని ప్రయాణికులు వాపోతున్నారు. 

ఎయిర్ ఇండియా విమానంలో మరోసారి సాంకేతిక సమస్యలు తల్లెత్తాయి. దీంతో అమెరికాలోని చికాగో విమానాశ్రయం నుంచి జాతీయ రాజధాని ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం రద్దు చేయబడింది. దీంతో 300 మంది ప్రయాణికులు చికాగో విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. కొంతమంది ప్రయాణీకులు ఢిల్లీకి ఎప్పుడు వెళ్లగలరనే దానిపై ఇంకా స్పష్టత లేదని ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఎయిర్ ఇండియాకు చెందిన విమానం చికాగో ఓహరే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం 13.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బయలుదేరి మార్చి 15న 14.20 గంటలకు ఢిల్లీలో దిగాల్సి ఉంది.

విమానంలో ప్రయాణించాల్సిన గోపాల్ క్రిషన్ సోలంకి రాధాస్వామి బుధవారం పిటిఐకి మాట్లాడుతూ.. ప్రయాణికులు సుమారు 24 గంటలు వేచి ఉన్నారని, ఇప్పటికీ "విమానయాన సంస్థ మాకు సమాధానం చెప్పలేదు" అని అన్నారు. చికాగో విమానాశ్రయంలో వేచి ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో సందేశంలో మాట్లాడుతూ.. "మాకు సరిగ్గా ఏమి జరుగుతుందో తెలియదు.. మేము ఎప్పుడు వెళ్తామనేదనిపై కూడా స్పష్టత లేదు" అని అతను చెప్పాడు. 

తాము దాదాపు 24 గంటల పాటు ఎయిర్‌పోర్టులో వేచి ఉన్నామని, ఢిల్లీకి ఎప్పుడు వెళ్తామనేదానిపై స్పష్టత రావడంలేదని వాపోతున్నారు.ఎయిర్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. మార్చి 14న సాంకేతిక కారణాల వల్ల AI 126 విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పారు. బాధిత ప్రయాణీకులకు ఆల్ రౌండ్ సపోర్ట్ అందించబడిందనీ, వారికి ప్రత్యామ్నాయ విమానాలలో వసతి కల్పించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము" అని ప్రతినిధి తెలిపారు. 2022లో సాంకేతిక కారణాల వల్ల మొత్తం 1,171 విమానాలు రద్దు కాగా, 2021లో 931, 2020లో 1,481 విమానాలు రద్దయ్యాయని ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలిపింది.

click me!