
పూణేలో దారుణం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అతని భార్య, వారి ఎనిమిదేళ్ల కుమారుడు బుధవారం శవాలై కనిపించారు. అయితే పోలీసులు ఈ ఘటనను హత్య-ఆత్మహత్య గా అనుమానిస్తున్నారు. భార్య, పిల్లల ముఖాలకు పాలిథీన్ సంచులు చుట్టి ఉండటంతో పాటు భర్త ఉరేసుకుని ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే.. ఆ వ్యక్తి మొదట తన భార్యను, కొడుకును హత్య చేసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పూణె నగరంలోని ఔంద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతులను సుదీప్తో గంగూలీ, అతని భార్య ప్రియాంక, కుమారుడు తనిష్కగా గుర్తించారు.
సూసైడ్ నోట్ దొరకలేదు
ఈ ఘటనపై చతుశృంగి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ.. బెంగళూర్ లో నివసిస్తున్న మృతుడు సుదీప్తో గంగూలీ సోదరుడు ఫోన్ చేయగా.. దంపతులు ఫోన్ కాల్‌లకు స్పందించకపోవడంతో, బెంగళూరులో నివసిస్తున్న సుదీప్తో సోదరుడు తన స్నేహితుడిని తన సోదరుడి ఇంటికి వెళ్లమని అడిగాడు. ఫ్లాట్ లాక్ చేయబడిందని గుర్తించిన తర్వాత, అతను తప్పిపోయినట్టు ఫిర్యాదు చేశాడు" అని పూణేలోని చతుష్రింగి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.అయితే ఫ్లాట్‌లో దంపతుల మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
డూప్లికేట్ కీతో లోపలికి ప్రవేశించిన పోలీసులు.. సుదీప్తో సీలింగ్‌కు వేలాడుతూ కనిపించగా, అతని భార్య , పిల్లల మృతదేహాలు పాలిథిన్ సంచుల్లో మూతపెట్టి నోళ్లు తెరిచి ఉన్నాయి. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అధికారి తెలిపారు. సుదీప్తో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాడని చెప్పాడు. తదుపరి విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.