
Air Indiaair: పాకిస్తాన్ భారతీయ విమానయాన సంస్థలకు తన గగనతలం మూసివేయడంతో ఎయిర్ ఇండియాకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఒక నివేదిక ప్రకారం ఎయిర్ ఇండియాకు దాదాపు 600 మిలియన్ డాలర్లు (సుమారు 5,000 కోట్ల రూపాయలు) అదనపు ఖర్చు అవుతుందట.
ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తలు ఇలాగే కొనసాగితే ఎయిర్ ఇండియా ఖర్చలు భారీగా పెరుగుతాయి. ఈ పరిస్థితిలో విమానాలను పాకిస్థాన్ మీదుగా కాకుండా కొత్త మార్గాల్లో నడపాల్సి వస్తోంది, దీంతో ఇంధన వినియోగం పెరుగుతోంది, ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకే కాదు విమానయాన సంస్థల ఖర్చు కూడా పెరుగుతుంది.
పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంతో విమాన ప్రయాణ సమయం పెరగి ప్రయాణికులకు ఇబ్బంది పడతారని ఇండియన్ ఎయిర్‌లైన్స్ భావిస్తున్నారు ఎయిర్ ఇండియాకు ప్రతి సంవత్సరం 591 మిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌పై ఈ ఆంక్షలు విధించింది. ఈ దాడిలో ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుండి మద్దతు లభించిందని భారతదేశం చెబుతోంది. ఈ ఆంక్షలు మే 23 వరకు అమలులో ఉంటుంది.
అయితే, ఈ ఆంక్ష అంతర్జాతీయ విమానయాన సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపదు. తాజా పరిస్థితుల కారణంగా నష్టాలను చవిచూస్తున్న ఎయిర్ ఇండియా ప్రభుత్వాన్ని సబ్సిడీ కోరింది.పాక్ ఆంక్షలతో ప్రభావితమైన విమానయానసంస్థలకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడి కాస్త ఉపశమనం కలిగించవచ్చు.
పాక్ గగనతలం మూసివేయడం, ఎక్కువ ఇంధనం ఖర్చవడం మరియు సిబ్బంది పనివేళలు పెరగడం కారణంగా నష్టం వస్తోందని ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే దీనిపై కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఎయిర్ ఇండియా, ఇండిగో రెండూ పాకిస్తాన్ గగనతలం మూసివేతతో ప్రభావితమవుతున్నాయి ఇండిగోలో కొన్ని విమానాలు స్వల్పంగా ప్రభావితమయ్యాయి, న్యూఢిల్లీ-బాకు విమానం సాధారణం కంటే 38 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంది. అయితే ఎయిర్ ఇండియాపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దాని చాలా అంతర్జాతీయ విమానాలు పాకిస్తాన్ గుండా వెళతాయి. ఢిల్లీ-మధ్యప్రాచ్య విమానాలు ఇప్పుడు ఒక గంట అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది, దీంతో ఇంధన ఖర్చులు పెరుగుతాయి.