ఎయిర్ కమోడోర్ ఎం.కె. చంద్రశేఖర్ జ్ఞాపకార్థం .. 'పరశురామ్' పైలట్ గా విశేష సేవలు, ఏమిటీ విమానం ప్రత్యేకత?

Published : Aug 30, 2025, 12:48 PM IST
MK Chandrasekhar

సారాంశం

భాతర వైమానిక దళంలో విశేష సేవలందించిన ఎయిర్ కమోడోర్ ఎం.కె. చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈ క్రమంలో ఐఎఎఫ్ అధికారికి ఆయన దేశానికి అందించిన సేవలను ఓసారి గుర్తుచేసుకుందాం.  

'పరశురామ్' గా ప్రసిద్ధి చెందింది డకోటా DC-3 భారత వైమానిక దళం (ఐఏఎఫ్) చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విమానం. 1947-48 ఇండో-పాక్ యుద్ధంలో ఇది చాలా కీలకంగా వ్యవహరించింది. కీలకమైన సమయంలో శ్రీనగర్‌కు దళాలను ఎయిర్‌లిఫ్ట్ చేయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది.. కాశ్మీర్ సురక్షితంగా ఉండేలా చూసింది. ఇది ఐఏఎఫ్ ప్రధాన రవాణా విమానాలలో ఒకటి… సైనిక లాజిస్టిక్స్‌ తరలింపుకు ఇదే ఆధారంగా ఉండేది. ఈ విమానం తరువాత 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పనిచేసింది. ఇలా భారతదేశ సైనిక విమానయాన చరిత్రలో దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తండ్రి, ఎయిర్ కమోడోర్ ఎం.కె. చంద్రశేఖర్ నిన్న(శుక్రవారం) రాత్రి మరణించారు. 1962 ఇండియా-చైనా సంఘర్షణ సమయంలో సైనికులను ఎయిర్‌లిఫ్ట్ చేయడానికి ఈ డకోటా DC-3  విమానాన్ని ఉపయోగించారు.. దీన్ని నడిపిన ప్రముఖ పైలట్లలో ఆయన ఒకరు. ఎంకే చంద్రశేఖర్ మరణం నేపథ్యంలో వైమానిక దళంలో, సమాజంలో ఆయన సేవల గురించి తెలుసుకుందాం. 

తండ్రి కోసం ఏకంగా యుద్దవిమానాన్నే కొన్న రాజీవ్ చంద్రశేఖర్ 

దశాబ్దాల సేవ తర్వాత, డకోటా DC-3 ఐఏఎఫ్ నుండి రిటైర్ అయింది. తన తండ్రికి ఈ డకోటా DC-3 విమానంతో ఉన్న అద్భుతమైన అనుబంధం గురించి రాజీవ్ చంద్రశేఖర్ కు తెలుసు. అందుకే ఆయన ఐర్లాండ్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్న డకోటా DC-3ని కొనుగోలు చేశారు. ఫిబ్రవరి 13, 2018న తన తండ్రి అందించిన సేవలకు గౌరవార్థంగా ఈ విమానాన్ని ఐఏఎఫ్‌కు బహుమతిగా ఇచ్చారు… ఆనాటి ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవాకు తాళాలు అప్పగించారు. ఎయిర్ కమాండర్ చంద్రశేఖర్  దేశానికి అందించిన సేవలకు గుర్తుగా ఈ విమానానికి 'పరశురామ్' అని పేరు మార్చారు.

బెంగళూరులో యుద్ధ స్మారక చిహ్నం: చంద్రశేఖర్ దార్శనికతతోనే సాకారం

కార్గిల్ విజయ్ దివాస్ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులోని నేషనల్ మిలిటరీ మెమోరియల్ వద్ద 75 అడుగుల ఎత్తు, 700 టన్నుల బరువున్న వీరగల్లు (యుద్ధ స్మారక శిల)ను ఆవిష్కరించారు. 16 సంవత్సరాలకు పైగా అడ్డంకులను ఎదుర్కొన్న ఈ ప్రాజెక్ట్ ఎయిర్ కమోడోర్ ఎం.కె. చంద్రశేఖర్ అవిశ్రాంత కృషి కారణంగా పూర్తయింది. ఆయన దార్శనికత, నిబద్ధత కారణంగా బెంగళూరు ఇప్పుడు భారతదేశ ధైర్య సైనికుల త్యాగాలను చిరస్థాయిగా నిలిపే జాతీయ స్మారక చిహ్నాన్ని కలిగి ఉంది.

 ఈ యుద్ధ స్మారక చిహ్నాన్ని కేవలం నివాళిగానే కాకుండా లివింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమెంబరెన్స్ ఆండ్ ఎడ్యుకేషన్ సంస్థగా భావించారు ఎంకే చంద్రశేఖర్. భవిష్యత్ తరాలు స్వేచ్ఛ ఎంత విలువైనదో అర్థం చేసుకోగల అభ్యాస కేంద్రంగా దీనిని తీర్చిదిద్దారు. రాతిపై చెక్కబడిన పేర్లు, ఎత్తైన జెండా స్తంభం, వీరగల్లు, భూగర్భ మ్యూజియంతో ఈ స్మారక చిహ్నం వీరులను గౌరవించేలా రూపొందించబడింది, వారి కుటుంబాలకు ఓదార్పునిస్తుంది. ఈ ప్రదేశంలో క్రమం తప్పకుండా జరిగే స్మారక కార్యక్రమాలు యువ భారతీయులను ప్రేరేపిస్తాయి.. సాయుధ దళాల ధైర్యం, నిస్వార్థతను గుర్తు చేస్తాయి.

గురువుగా చంద్రశేఖర్ పాత్ర

చాలా యుద్ధాలలో దేశానికి తన సేవలు అందించడంతో పాటు ఎం.కె. చంద్రశేఖర్ భవిష్యత్ నాయకులను కూడా తీర్చిదిద్దారు. రాజకీయాల్లోకి రాకముందు ఐఏఎఫ్‌లో పనిచేసిన రాజేష్ పైలట్‌కు ఆయన శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం రాజస్థాన్ కు చెందిన రాజకీయ నాయకుడు సచిన్ పైలట్ తండ్రే ఈ రాజేష్ పైలట్… ఈయన అక్టోబర్ 29, 1966న వైమానిక దళంలో చేరారు. రాజకీయాలపై ఆసక్తితో 1979లో ఐఏఎఫ్ కు రాజీనామా చేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పనిచేశారు. .

ఎయిర్ కమోడోర్ గా ఎం.కె. చంద్రశేఖర్ కెరీర్

పుట్టిన ప్రదేశం: దేశమంగళం, త్రిసూర్, కేరళ

ఐఏఎఫ్‌లో చేరిన సమయం : జూలై 17, 1954

రిటైర్మెంట్ : డిసెంబర్ 25, 1986 (స్వచ్ఛందంగా)

బోధకుడి రేటింగ్: A1

వైమానిక దళంలో నిర్వహించిన స్థానాలు

ఫ్లయింగ్ ఆఫీసర్: జూలై 17, 1955

ఫ్లైట్ లెఫ్టినెంట్: జూలై 17, 1959

స్క్వాడ్రన్ లీడర్: జూలై 17, 1965

వింగ్ కమోడోర్ : ఏప్రిల్ 1, 1974

యాక్టింగ్ గ్రూప్ కెప్టెన్: జూన్ 20, 1977

గ్రూప్ కెప్టెన్: ఏప్రిల్ 1, 1978

యాక్టింగ్ ఎయిర్ కమోడోర్: జనవరి 5, 1981

ఎయిర్ కమోడోర్: జూలై 1, 1982

సాధించిన అవార్డులు

విశిష్ట సేవా పతకం (VSM): జనవరి 26, 1964

వాయు సేన పతకం (VM): జనవరి 26, 1970

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu