
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తండ్రి ఎయిర్ కమోడోర్ మంగతిల్ కరకడ్ చంద్రశేఖర్ శుక్రవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. 92 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. త్రిస్సూర్‌లోని దేశమంగళంకు చెందిన ఆయన 1954లో భారత వైమానిక దళంలో చేరి 1986లో ఎయిర్ కమోడోర్‌గా పదవీ విరమణ చేశారు. ఆయనకు భార్య ఆనందవల్లి, కుమార్తె డాక్టర్ దయా మీనన్, కుమారుడు రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నారు.
ఎంకేె. చంద్రశేఖర్ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం 1.30కి కుడ్లు గేట్‌లోని రుద్ర భూమిలో జరిగాయి. మధ్యాహ్నం వరకు బెలందూరులోని ఎప్సిలాన్ విల్లాలో పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.
30 ఏళ్లకు పైగా భారత వైమానిక దళంలో విశిష్ట సేవలందించిన ఎయిర్ కమాండోర్ ఎం.కె. చంద్రశేఖర్ శుక్రవారం కన్నుమూశారు. బెంగళూరులోని తన ఇంట్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర, కేంద్ర రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.