Operation Sindoor: పాక్ పై భారత్ విజయం.. యుద్ధ విమానాల దాడిపై ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఏమన్నారంటే?

Published : Aug 09, 2025, 01:25 PM IST
Air Chief Marshal AP Singh

సారాంశం

Operation Sindoor:భారత వాయుసేన ఆపరేషన్ సిందూర్‌లో ఎస్-400 రక్షణ వ్యవస్థ ఐదు పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చి కీలక విజయాన్ని సాధించింది. మురిద్కేలష్కర్ ప్రధాన కార్యాలయాలపై జరిగిన దాడులు విజయవంతంగా పూర్తయ్యాయని వైమానిక దళ చీఫ్ ఎపి సింగ్ వెల్లడించారు. 

Operation Sindoor: పాక్ పై ప్రతికార దాడిగా భారత వాయువ్య దళం ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ విజయవంతం అయిందనీ వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ తెలిపారు, ఎస్-400 గేమ్-ఛేంజర్ రక్షణ వ్యవస్థ ఐదు పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేసి, భారత వైమానిక శక్తిని ప్రపంచ దేశాలను చాటి చూపామని అన్నారు. మురిద్కే-లష్కర్ ప్రాంతాల్లో పాకిస్థానీ ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలపై జరిపిన దాడులు విజయవంతమయ్యాయని, ఆ ప్రాంతం గురించి ప్రత్యేక సమాచారం, ఉపగ్రహ చిత్రాలతో వైమానిక దళం సాయుధంగా వివరించింది.

భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించారు. మురిద్కే-లష్కర్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడికి ముందు, తరువాత తీసిన ఉపగ్రహ చిత్రాలను ప్రదర్శిస్తూ, భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అపూర్వమైన ప్రతిభను చూపించాయని తెలిపారు.

రక్షణ వ్యవస్థలలో ఎస్-400 సిస్టమ్ గేమ్-ఛేంజర్‌గా మారిందని ఎపి సింగ్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా ఐదు పాకిస్తానీ యుద్ధ విమానాలను కూల్చివేయడం సాధ్యమైంది. ఎస్-400 పరిధి కారణంగా పాకిస్తానీ విమానాలు భారత వైమానిక రక్షణ వ్యవస్థకు సమీపించలేకపోయాయని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !