ఢిల్లీలోని అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి:పోలీసుల తీరుపై ఎంపీ ఫైర్

By narsimha lode  |  First Published Aug 14, 2023, 5:16 PM IST

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన న్యూఢిల్లీలోని ఇంటిపై గుర్తు తెలియని దుండగులు  దాడికి పాల్పడ్డారు.


న్యూఢిల్లీ:  ఎంఐఎం  చీఫ్, ఎంపీ  అసదుద్దీన్ ఓవైసీ  న్యూఢిల్లీలోని ఇంటిపై  గుర్తుతెలియని దుండగులు దాడికి దిగారు.  ఈ ఘటనలో  ఇంటి కిటికీలు,  ఏసీ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఐదు రోజుల క్రితం  తనకు  బెదిరింపు మేసేజ్ లు వచ్చినట్టుగా ఓవైసీ గుర్తు చేశారు.  ఈ విషయమై  తాను  పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 20న  ఎంఐఎం చీఫ్ అసద్ నివాసంపై  రాళ్ల దాడి జరిగింది.ఈ దాడిలో ఎవరికి గాయాలు కాలేదు. న్యూఢిల్లీలోని ఆశోక్ రోడ్డులో గల ఇంటిపై  దుండగులు రాళ్లతో దాడికి దిగారు. సాయంత్రం ఐదున్నర నుండి ఆరు గంటల మధ్య ఈ దాడి జరిగిందని  అప్పట్లో అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియాలో ప్రకటించారు.రాళ్ల దాడి తర్వాత తన ఇంటి పరిస్థితిని వివరిస్తూ ట్విట్టర్ లో  ఆయన వీడియో షేర్ చేశారు.2014 నుండి  అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి జరగడం ఇది ఐదోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన దాడి నాలుగో దాడిగా  అప్పట్లో  అసదుద్దీన్ ఓవైసీ  పేర్కొన్న విషయం తెలిసిందే.

Latest Videos

click me!