న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో ఏడు మైకోప్లాస్మా న్యుమోనియా పాజిటివ్ కేసులు: అలర్టైన యంత్రాంగం

By narsimha lodeFirst Published Dec 7, 2023, 1:14 PM IST
Highlights

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో ఏడు మైకోప్లాస్మా  న్యుమోనియా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో   ఏడు మైకోప్లాస్మా న్యుమోనియా బాక్టీరియా  పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.చైనాలో మైకోప్లాస్మా  న్యుమోనియా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అదే బాక్టీరియా ప్రస్తుతం  ఇండియాలోకి ప్రవేశించింది. 

ఈ ఏడాది ఏప్రిల్  నుండి సెప్టెంబర్  మధ్య కాలంలో  భారత్ లో  ఏడు శాంపిల్స్ రికార్డైనట్టుగా   లాన్సెట్  మైక్రోబ్  అధ్యయనం తెలిపింది.  పీసీఆర్  పరీక్షల సమయంలో  ఒక్క కేసు వెలుగు చూసింది.మిగిలిన ఆరు కేసులు  ఐజీఎం ఎలీసా పరీక్షల సందర్భంగా బయటకు వచ్చాయి. పీసీఆర్  పాజిటివిటీ రేటు 3 శాతంగా ఉంది.  ఐజీఎం ఎలీసా  పరీక్షల పాజిటివిటీ రేటు 16 శాతంగా ఉందని ఈ నివేదిక వెల్లడిస్తుంది.   ఈ ఏడాది ఏప్రిల్  నుండి సెప్టెంబర్  30వ తేదీ వరకు  30 పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.  మరో వైపు  37 ఐజీఎం  ఎలీసా పరీక్షలు చేశారు.అయితే   వీటిలో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Latest Videos

అయితే  ఈ కేసులు  అంటువ్యాధి స్థాయికి పెరుగుతాయా  లేదా అనే అంశాలపై  పరిశోధనలు జరుగుతున్నాయి.ఈ బాక్టీరియా  అరుదైన కేసుల పెరుగుదలకు దారితీస్తుందో లేదో తెలియదని లాన్సెట్ నివేదిక తెలిపింది.  అనేక యూరిపోపియన్ దేశాలు, చైనాలో  ఈ ఏడాది పిల్లల్లో న్యుమోనియో కేసులు పెరిగాయని నివేదించిన సమయంలోనే ఈ నివేదిక వెలువడింది.అమెరికా, యూకే, ఇజ్రాయిల్ సహా అనేక దేశాల్లో  మైకోప్లాస్మా న్యుమోనియో బాక్టీరియా కేసులు నమోదయ్యాయి.దేశంలో  ఈ బాక్టీరియా ప్రవేశించడంతో  దేశ వ్యాప్తంగా అలెర్ట్ విధించారు.  

గత మాసంలో చైనాలో  చిన్న పిల్లల్లో  ఈ వ్యాధి బారిన పడిన కేసులు అధికంగా నమోదైన విషయం తెలిసిందే. పౌష్టికాహరం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుండి పిల్లలను రక్షించవచ్చని వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
 

 

click me!