పపువా న్యూ గినియోలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రతీసారి భారత్ తన చేయూతను అందిస్తోంది.
పపువా న్యూ గినియోలో అగ్నిపర్వతం బద్దలైంది. దీనివల్ల అక్కడ భారీగా నష్టం వాటిల్లింది. సహాయం కోసం ఎదురుచూస్తోంది. న్యూగినియాకి సహాయం చేయడానికి భారత్ ముందుకు వచ్చింది. ఎనిమిది కోట్ల రూపాయలను సహాయ నిధి కింద ప్రకటించింది. బుధవారం నాడు ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
పపువా న్యూ గినియోలో ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల దాదాపుగా 26వేల మందిని వారి స్వస్థలాల నుండి ఖాళీ చేయించాల్సి వచ్చిందని ఒక ప్రెస్ రిలీజ్ లో ఎంఈఏ తెలిపింది. భారత్ కు పపువా న్యూ గినియోకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు మిత్ర దేశాలు. ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కార్పొరేషన్ (ఎఫ్ఐపిఐసి)లో డెవలప్మెంట్ పార్ట్ నర్స్.
అందుకే భారత్ వెంటనే మిత్ర దేశానికి సంఘీభావం ప్రకటించింది. ఆ దేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై సంతాపం వ్యక్తం చేసింది. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
పపువా న్యూ గినియోలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రతీసారి భారత్ తన చేయూతను అందిస్తోంది. 2018 లో భూకంపం సమయంలో, 2019లో అగ్ని పర్వతం బద్దలైనప్పుడు కూడా అండగా ఉంది. డిజాస్టర్స్ వల్ల ఏర్పడే సమస్యలు, వాటి నిర్వహణ.. ఎదుర్కోవడం, నివారించడంలపై పనిచేసే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అనేది భారత్.. ఇండో పసిపిక్ ఓషియన్స్ ఇన్షియేటివ్ ప్రకటనలో ముఖ్యమైన భాగంగా ఉంది. ఈ ప్రకటనను 2019లో ప్రధాని నరేంద్ర మోడీ చేశారు.