Ram Temple opening : సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, ముఖేష్ అంబానీలతో సహా 7,000 మందికి ఆహ్వానం...

By SumaBala Bukka  |  First Published Dec 7, 2023, 11:55 AM IST

ముందుగా ఆహ్వానితులందరికీ ఒక లింక్ షేర్ చేస్తాం. అందులోవారు తమ పేరు నమోదు చేసుకున్న తర్వాత, ఎంట్రీ పాస్‌గా పని చేసే బార్ కోడ్ రూపొందిస్తాం.. అని శర్మ చెప్పారు.


అయోధ్య : రామజన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణం తుది దశలో ఉంది. దీని ప్రారంభోత్సవానికి వేలాదిమంది ప్రముఖులను ఆహ్వానించారు. క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రముఖ టీవీ సీరియల్ 'రామాయణం'లో రాముడు, సీతగా నటించిన నటులు అరుణ్ గోవిల్, దీపికా చిక్లియాలు జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానితుల్లో ఉన్నారు. 

3,000 మంది వీఐపీలతో సహా 7,000 మంది అతిథులను రామమందిర్ ట్రస్ట్ ఆహ్వానించింది. అయోధ్యలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కరసేవకుల కుటుంబాలను కూడా వేడుకకు ఆహ్వానిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆహ్వానించబడిన వారిలో ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్, యోగా గురువు రామ్‌దేవ్, దేశవ్యాప్తంగా ఉన్న 4,000 మంది సాధువులు, రచయితలు, పాత్రికేయులు, శాస్త్రవేత్తలు.. ఇతర ముఖ్యమైన పౌరులు ఉన్నారు. పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబాయ్, రతన్ టాటా, గౌతమ్ అదానీలలాంటి వీవీఐపీలకు కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. బార్‌కోడ్ పాస్‌ల ద్వారా వీవీఐపీలకు ప్రవేశం ఉంటుంది.

Latest Videos

undefined

న్యూగినియాకు భారత్ ఎనిమిదికోట్ల సాయం..

సాధువులు, పురోహితులు, శంకరాచార్యులు, మత పెద్దలు, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, గాయకులు, పద్మశ్రీ, పద్మభూషణ్ విజేతలు ఆహ్వానం పొందిన వారిలో ఉన్నారు. వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ మాట్లాడుతూ.. రామ మందిర ఉద్యమానికి మద్దతు పలికిన జర్నలిస్టులను కూడా తమ రచనలు, నివేదికల ద్వారా ఆహ్వానించామని, వారు లేకుంటే రామాలయ పోరాటం విజయవంతం కాదన్నారు.

"వేడుకకు ముందు ఆహ్వానితులందరితో ఒక లింక్ షేర్ చేస్తాం. అందులోవారు తమను తాము నమోదు చేసుకున్న తర్వాత, ఎంట్రీ పాస్‌గా పని చేసే బార్ కోడ్ రూపొందిస్తాం" అని శర్మ చెప్పారు. చంపత్ రాయ్ సంతకంతో ఉన్న ఆహ్వాన పత్రం ఇలా ఉంది : "సుదీర్ఘమైన పోరాటం తర్వాత, శ్రీరామ జన్మభూమిలో ఆలయ నిర్మాణం పురోగతిలో ఉందని మీకు తెలుసు, పౌష్ శుక్ల ద్వాదశి, విక్రమ సంవత్ 2080, సోమవారం, 22 జనవరి, 2024, కొత్త రామ్ లల్లా విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించబడుతుంది" అని అందులో రాసి ఉంది. 

click me!