కోతులను తరిమేందుకు ఎలుగుబంటిలా డ్రస్ వేసి : అధికారుల ప్రయోగం, వీడియో వైరల్

By Siva KodatiFirst Published Feb 7, 2020, 5:56 PM IST
Highlights

శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వై పైకి పెద్ద సంఖ్యలో కోతులు వచ్చి చేరాయి. వాటిని ఎలా తరమాలో అర్ధం కాని అధికారులు.. ఒకరికి ఎలుగుబంటి దుస్తులను ధరింపజేసి రన్‌వే పై పరిగెత్తించారు

ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ఉన్న కోతులను తరిమేందుకు అధికారులు వినూత్నంగా ఆలోచించారు అహ్మదాబాద్ విమానాశ్రయ అధికారులు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వై పైకి పెద్ద సంఖ్యలో కోతులు వచ్చి చేరాయి.

Also Read:చపాతీలో అమ్మకు లేఖలు:మెహబూబా ముఫ్తీ కూతురు

వాటిని ఎలా తరమాలో అర్ధం కాని అధికారులు.. ఒకరికి ఎలుగుబంటి దుస్తులను ధరింపజేసి రన్‌వే పై పరిగెత్తించారు. దీంతో నిజంగానే ఎలుగు వస్తుందని భయపడిపోయిన కోతులు అక్కడి నుంచి పారిపోయాయి.

దీనిపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మనోజ్ గంగల్ మాట్లాడుతూ.. కోతులు.. ఎలుగుబంట్లను చూసి భయపడతాయి. కాబట్టి తాము ఎలుగును పోలీస దుస్తులు తయారు చేయించి సిబ్బందికి తొడిగి వాటిని పరిగెత్తించాము. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇక నుంచి దీనిని కొనసాగిస్తామని మనోజ్ స్పష్టం చేశారు.

Also Read:బాగీరథి అమ్మ: 105 ఏళ్ల వయస్సులో నాలుగో తరగతి పరీక్షల్లో పాస్

కాగా మనుషుల కేంద్రాలు జంతువుల ఆవాసాల వరకు విస్తరించడంతో.. భారత్‌లోని అనేక నగరాలు, పట్టణాలు కోతుల బెడదను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోకి చాలాకాలంగా కోతుల సమస్య ఉంది. ఏకంగా పార్లమెంట్ భవనం వద్ద సంచరిస్తున్న కోతులను భయపెట్టడానికి 2014లో కోతుల వలే నటించడానికి ప్రభుత్వం 40 మందిని నియమించిన సంగతి తెలిసిందే. 

 

Gujarat: An airport official at Sardar Vallabhai Patel International Airport in Ahmedabad dressed in 'bear' costume to scare away langoors on the premises. (Source-Airport Authority of India) pic.twitter.com/Qa6iIPFoLq

— ANI (@ANI)
click me!